మంత్రి వా .. వీధి రౌడీ వా..!?
*మంత్రి కేటీఆర్ ల లుచ్చా.. లఫంగి.. వ్యాఖ్యలు బీజేపీ సంస్కృతి కాదు..
* మంత్రి హోదాలో ఉండి ప్రధానమంత్రి పై అనుచిత వ్యాఖ్య లా..?
* ప్రధానిపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ సౌత్ జోన్ .. మంత్రి దిష్టిబొమ్మ దహనం..
కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) మంత్రి హోదాలో ఉండి భారతదేశ ప్రధాని పై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి సిగ్గు ఉండాలని, మంత్రి వీధి రౌడీల్లా మాట్లాడుతున్నారని, మంత్రి కేటీఆర్ లా లుచ్చా , లఫంగి వ్యాఖ్యలు చేసే సంస్కృతి బిజెపిలో ఉండదని , రాజకీయాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ను అసభ్య పదజాలంతో దూషించే సంస్కృతి బిజెపిలో లేదని, ప్రధాని పదవికి గౌరవం ఇవ్వకుండా కేటీఆర్ ల మాట్లాడే నీచ రాజకీయ విధానం టీఆర్ఎస్ లోనే ఉందని, మంత్రి కేటీఆర్ మూర్ఖత్వం గా అజ్ఞానంతో అహంకారంగా ప్రధాని మోడీ పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్లెం వాసుదేవ రెడ్డి , కరీంనగర్ సౌత్ జోన్ అధ్యక్షులు నాగసముద్రం ప్రవీణ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ , బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ పై మంత్రి కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ శుక్రవారం కరీంనగర్ లోని తెలంగాణ చౌరస్తా వద్ద సౌత్ జోన్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ అధికార మదంతో కేటీఆర్ సోయి తప్పి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు . ప్రపంచ దేశాల మన్నలను పొందుతూ , ప్రపంచ దేశాల్లోనే అత్యుత్తమప్రధాని గా నంబర్ వన్ స్థానంలో ఉన్నా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడానికి మంత్రి కేటీఆర్ కు సిగ్గుండాలన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ భారత దేశానికి చేస్తున్న సేవలను ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయి కానీ, తెలంగాణ రాష్ట్రంలోని టిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ గుర్తించకపోవడం దౌర్భాగ్యం అన్నారు. గత ఎనిమిదేళ్లలో బిజెపి ప్రధాని నరేంద్ర మోడీ అనేక చారిత్రక నిర్ణయాలతో దేశాన్ని అగ్రపథంలో నడిపిస్తున్నారని , 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశ పాలన లో జరగనివి ఎనిమిదేళ్ల బీజేపీ పాలన లో చేసి చూపించారని తెలిపారు. దేశ శ్రేయస్సు అభ్యున్నతి గురించి ,దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచన విధానాల పైఏమాత్రం అవగాహన లేని మంత్రి కేటీఆర్ కు మాట్లాడే అర్హత లేదన్నారు. తెలంగాణలో నిరంతరం సెంటిమెంటును రగిల్చి పబ్బం గడుపుకునే టిఆర్ఎస్ కు కాలం చెల్లిందని, అందుకే “పోయే కాలానికి వెలుగు ఎక్కువ “అన్నట్టు టిఆర్ఎస్ పార్టీ నాయకులు, మంత్రులు వ్యవహరిస్తున్నారని చెప్పారు. మంత్రి కేటీఆర్ తన స్థాయిని మరిచి, అహంకారంతో ప్రధాని నరేంద్ర మోడీ గురించి అసభ్య కర వ్యాఖ్యల కు తగిన మూల్యం మంత్రి కేటీఆర్ త్వరలోనే చెల్లించుకుంటారని హెచ్చరించారు.ఎనిమిదేళ్ల టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల మయంగా మార్చిందని, తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోందని ఆయన దుయ్యబట్టారు.”కుట్లే రాయితీ లేనోడు ఎట్లా రాయి తీస్తానన్నటు “మంత్రి కేటీఆర్ వ్యవహారం ఉందని ,ముందు మంత్రి పర్యవేక్షణలో ఉన్న మున్సిపల్ ,ఐటి శాఖ లో ఉన్న సమస్యలను చక్క దిద్దుకొని, ఆయా రంగాల బలోపేతానికి కృషి చేస్తే మంచిదని హితవు పలికారు . పొద్దుకులు బిజెపిని ఆడిపోసుకోవడం మంత్రి కేటీఆర్ కు అలవాటుగా మారి, మతిభ్రమించిందన్నారు. ప్రధాని మోడీ గురించి కేటీఆర్ కు మాట్లాడే నైతిక అర్హత లేదని, ముందు తెలంగాణ రాష్ట్రాన్ని చక్క దిద్దుకొని, దేశం గురించి, దేశ ప్రధాని గురించి మాట్లాడితే మంచిదని ఈ సందర్భంగా హితవు పలికారు. ప్రధాని నరేంద్ర మోడీ గురించి ఇకపై మాట్లాడితే ఊరుకునేది లేదని , తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సౌత్ జోన్ ప్రధానకార్యదర్శి హరీష్ శంకర్ ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీకాంత్ నాయక్ బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు సంపత్ సౌత్ జోన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు కన్నాంబగారు సౌత్ జోన్ కిసాన్ మోర్చా అధ్యక్షులు మహేందర్ రెడ్డి సౌత్ జోన్ బీజేవైఎం అధ్యక్షుడు అక్షయ్ బీజేవైఎం సౌత్ జోన్ ఉపాధ్యక్షుడు సందీప్ కుమార్ ప్రవీణ్ కుమార్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు