అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి కొప్పుల
జగిత్యాల అర్బన్ మండలo ధరూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం ఆవిష్కరించారు. వారి వెంట జగిత్యాల ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్, జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేష్, ఫైనాన్స్ కమిషన్ ఛైర్మెన్ రాజేశం గౌడ్, ఏఎంసి ఛైర్మెన్ దామోదర్ రావు, జెడ్పీటీసీ మహేశ్, పాక్స్ ఛైర్మెన్ మహిపాల్ రెడ్డి, మాజీ మార్క్ ఫెడ్ చైర్మన్ లోక బాపు రెడ్డి, సర్పంచ్ ప్రభాకర్, పాక్స్ వైస్ చైర్మన్ సురేందర్, ఉప సర్పంచ్ మహేష్, గ్రామ శాఖ అధ్యక్షులు వెంకటి, ప్రజా ప్రతినిదులు, అంబేద్కర్ సంఘ మాల మహానాడు నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.