మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఆధ్వర్యంలో ఘనంగా ముఖ్యమంత్రి కేసిఆర్ వివాహ వార్షికోత్సవ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శోభమ్మ గార్ల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు నగర మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఆధ్వర్యంలో నగరంలోని ఫారెస్ట్ చౌరస్తా సమీపంలో గల ప్రభుత్వ అనాధ పిల్లల పాఠశాలలో వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లల ఇబ్బందులను గ్రహించిన సర్దార్ రవీందర్ సింగ్ ఎయిర్ కూలర్ ను అందించటం తోపాటు కేసిఆర్ గారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా పిల్లలకు భోజనాలు ఏర్పాటు చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా నగర మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని అనాథ పిల్లల మధ్యలో జరుపుకోవడం జరిగిందని భగవంతుడు కేసిఆర్ గారి దంపతులకు ఆయురారోగ్యలు, అష్టా ఐశ్వర్యాలు నిండు నూరు ఏళ్ళు వర్దిలే విధంగా ఆశీర్వాదాలు ఇవ్వాలని అదేవిధంగా భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ స్టేట్ గా చేసే శక్తి ని ఇవ్వలేని ఆదేవ దేవుడిని కోరుకుంటున్నామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సాదవేణి శ్రీనివాస్, గుంజపడుగు హరిప్రసాద్, జంగలపల్లి కుమార్ పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు