Viral Video: బైకర్‌పై పడిన బండరాయి, స్పాట్ డెడ్.. ఎక్కడ అంటే

రెప్పపాటులో ఏమయినా జరగొచ్చు.. అవును ప్రమాదం ఏ వైపు నుంచి అయినా రావొచ్చు. ఇందులో సందేహాం లేదు. ఎందుకంటే కొన్ని కొన్ని ప్రమాదాలను ఊహించలేం. క్షణకాలంలో ఏమయినా జరగొచ్చు. అప్పటివరకు సరదాగా ఉండి.. ఆ తర్వాత విషాద వదనంలో ఉండాల్సిన సిచుయేషన్. కేరళలో అలాంటి ప్రమాదం జరిగింది. అయితే దానికి సంబంధించి వీడియో తీయడం.. షేర్ చేయడం జరిగిపోయింది. ఇంకేముంది జనాలు.. అయ్యో అంటున్నారు.

ఓ బైకర్ జాలీగా వెళుతున్నాడు. అతను టాప్ స్పీడులో వెళ్లగా.. మరొకరు వీడియో తీశారు. అంతవరకు ఓకే.. కానీ విధి వెక్కరించింది. అసలే అదీ ఘాట్ రోడ్డు.. ఇంకేముంది ఓ పెద్ద బండ రాయి వచ్చి పడింది. అదీ కూడా అతనికి సరిగ్గా తాకింది. ఇంకేముంది వాహనం నుజ్జు నుజ్జు కాగా.. ఆ యువకుడు అక్కడిక్కడే చనిపోయాడు. అప్పటివరకు వీడియో తీసిన వ్యక్తి కూడా ఆశ్చర్యపోయాడు. ఇదేంటి ఇలా జరిగిందని అనుకున్నారు.

బండ రాయి పడటంతో బైక్‌తో సహా అతను వాగులో పడిపోయాడు. అప్పటికే తీవ్రగాయాలు కావడంతో చనిపోయాడు. అతనిది మలప్పురం అని.. 20 ఏళ్ల వయస్సు ఉంటుందని గుర్తించారు. ఆ బైక్ ఫాలొ అవుతున్న వ్యక్తి వీడియో తీశాడు. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదని అంటున్నారు. నిజమే.. మృత్యువు నిమిషంలో రావొచ్చు. అందులో మాత్రం సందేహాం లేదు. మలప్పురానికి చెందిన యువకుడికి అలాంటి అనుభవమే ఎదురయ్యింది.

అప్పటివరకు జాలీగా బండి నడపగా.. ఒక్కసారిగా మృత్యువు కొండచరియ రూపంలో వచ్చింది. నేరుగా అతనిపై పడటంతో.. లేచే వీలు లేకుండా పోయింది. బండి స్పీడ్ ఉన్న లాభం లేకపోయింది. కరెక్టుగా అతను వెళ్లే సమయంలోనే ఆ బండ రాయి పడింది. అతనికి తప్పించుకునే అవకాశమే లేదు. గద్ద తనుక్కువెళ్లినట్టు యువకుడిని మృత్యువు తీసుకెళ్లిపోయింది. ఆ వీడియో తీసిన సదరు వ్యక్తి కూడా బాధపడ్డారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents