కళ్యాణాలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మానకొండూర్ ఎమ్మెల్యే
మానకొండూర్ తొలిపొద్దు కార్యక్రమంలో భాగంగా తెల్లవారు జామున ప్రజానాయకుడు మానకొండూర్ శాసనసభ్యులు డా. రసమయి బాలకిషన్ శంకరపట్నం మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. మెట్ పల్లి, లింగాపూర్, కొత్తగట్టు, కరీంపేట గ్రామాల్లో ఆయన కాలి నడకన గడపగడపకు తిరుగుతూ ప్రజలతో మమేకమవుతూ, లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి కళ్యాణాలక్ష్మి చెక్కులతో పాటు తన తోబుట్టు లాంటి ఆడబిడ్డల చీరలను పంపిణీ చేశారు. ఈ సంధర్బంగా ఆయా గ్రామాల్లోని మహిళలు రసమయికు నుదుటిన తిలకం దిద్దుతూ మంగళ హారతులతో ఘనస్వాగతం పలికారు.