సివిల్ తగాదాలలో ఏ అధికారి తలదూర్చకూడదు: జిల్లా ఎస్పీ
జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదివస్ లో 21 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులకు న్యాయం చేయడానికి ప్రజదివాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎస్పీ అన్నారు. ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుంటామని, బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. ఫిర్యాదులు పెండింగ్ పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదు దారులతో నేరుగా మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఎస్ హెచ్ ఓ లను ఆదేశించినట్లు చెప్పారు. సివిల్ సమస్యలను కోర్టులో పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు. భూమిని నమోదు చేయమని లేదా పౌర వివాదాలకు పాల్పడాలని, పరిష్కారాలు చేయమని పౌరులను ఎవరైనా బెదిరిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాము,. ఇలాంటి సంఘటనలకు సంబంధించి ప్రజలు మా కార్యాలయానికి వచ్చి పిర్యాదు చేయవచ్చు. సివిల్ తగాధల్లో ఏ అధికారి కూడా తలదూర్చకుడదని ఏ అధికారి ఐన సివిల్ తగాధల్లో ఇబ్బందికి గురిచేస్తే నేరుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో పిర్యాదు చేయవచ్చు అని ఎస్పీ చెప్పారు.