రాజన్నను దర్శించుకున్న మంత్రి
వేములవాడ శ్రీపార్వతి రాజరాజేశ్వర స్వామి వారిని ఈరోజు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు దర్శించుకున్నారు. వారు ఆలయంలోకి ప్రవేశించగానే ఈవో రమాదేవి , వేద పండితులు వారికి ఎదురేగి పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు. అంతరాలయంలోని స్వామివార్లను , అమ్మవారిని దర్శించుకుని వారు తరించారు. కళ్యాణ మండపంలో వేద పండితులు వేదోక్త ఆశీర్వచనం చేయగా. ఈవో రమాదేవి స్వామివారి శేష వస్త్రాలతో వారిని సన్మానించి. స్వామివారి ప్రసాదాలను అందజేశారు. దర్శనానంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్ ను ఆలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఉపాధ్యాయుల చందు , గౌరవ అధ్యక్షులు , ప్రోటోకాల్ సూపరింటెండెంట్ శ్రీ రాములు పట్టు వస్త్రం కప్పి ఆత్మీయ సన్మానం చేశారు.