క్రీడా శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి
కరీంనగర్ నగరపాలక సంస్థ, జిల్లా యువజన, క్రీడా శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని పదిహేను సంవత్సరాల లోపు బాలబాలికలకు సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ మేయర్ వై సునీల్రావు కోరారు. ఆసక్తి ఉన్న బాలబాలికలు ఈనెల 5వ తారీఖులోగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టేడియంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తు సమర్పించాలని కోరారు.