కూలిగా మారిన స్టార్ హీరో.. ఎవరంటే..?

0 296,136

ఒకప్పుడు స్టార్ హీరో.. ఇప్పుడు కూలి పని.. ఎవరంటే..?

సినిమా అవకాశాల కోసం ఎన్నో కష్టాలు పడి.. చివరికి తమ నటనతో , ప్రతిభతో ఎన్నో సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోలుగా చలామణి అవుతున్న ఎంతో మందిని మనం చూస్తూనే ఉన్నాము. అయితే అవకాశాల కోసం కష్టపడి అవకాశం దక్కించుకున్న తర్వాత అనతి కాలంలోనే స్టార్ హీరోగా చలామణి అయ్యి.. ఉన్నట్టుండి సినిమాలకు దూరం కావడం .. అది కూడా కూలిపని చేసుకుంటూ జీవితాన్ని గడపడం అనేది చాలా బాధాకరం అని చెప్పవచ్చు. తమ అభిమాన స్టార్ హీరో కూలి పని చేస్తున్నాడని తెలిస్తే అభిమానులు సైతం తట్టుకోలేరు. అలాంటి వారిలో అప్పటి యువతకు రోల్ మోడల్ గా అమ్మాయిలకు కలల రాకుమారుడిగా మిగిలిన అబ్బాస్ గురించి మనం ఇప్పుడు చెప్పుకోవాల్సిందే. అబ్బాస్ లాగా అబ్బాయిలు తమ హెయిర్ స్టైల్ ను మార్చుకొని ఒక ట్రెండ్ సెట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ప్రేమదేశం సినిమాతో తెలుగు , తమిళ ప్రేక్షకులకు బాగా సుపరిచితుడు గా మారిన అబ్బాస్ 90 లలో స్టార్ హీరో గా చలామణి అయ్యారు. 1996 – 2002 వరకు స్టార్ హీరో గా చలామణి అయ్యారు. బాలకృష్ణ నటించిన కృష్ణ బాబు, రజనీకాంత్ నటించిన నరసింహ, వెంకటేష్ నటించిన రాజా వంటి చిత్రాలలో సెకండ్ హీరోగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందాడు. అయితే ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యాడు. ఇందుకు గల కారణం ఏమిటో అనే విషయం పై ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటనపై ఆసక్తి పోయింది.. మనసు పెట్టలేక పోతున్నాను అంటూ ఇటీవల తన అభిమానులతో సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చాడు అబ్బాస్.

 వెస్ట్ బెంగాల్ లోని హౌరా లో జన్మించిన తెలుగు , తమిళ ప్రేక్షకులకు బాగా సుపరిచితుడు అయ్యాడు. అయితే ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఈయన జాడ కనపడకపోవడం తో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎనిమిది సంవత్సరాలకు పైగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న అబ్బాస్ ప్రస్తుతం న్యూజిలాండ్ లో సెటిల్ అయ్యే అక్కడే పెట్రోల్ బంక్ లో పని చేస్తున్నట్లు ఆ వచ్చిన డబ్బులతోనే కుటుంబాన్ని పోషిస్తున్నట్లు సమాచారం. కనీసం ఇప్పటికైనా నటన మీద ఆసక్తి కలిగి మళ్లీ ఇండస్ట్రీలోకి రావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents