డయాలసిస్ కేంద్రాలు ఆసుపత్రుల్లో పడకల పెంచాలని మంత్రి ని కోరిన చొప్పదండి ఎమ్మెల్యే
చొప్పదండి నియోజకవర్గం లోని కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చిన మంత్రి హరీష్ రావు కి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఘణ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలు విజ్ఞప్తులు చేశారు.
చొప్పదండి, గంగాధర లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పడకలు పెంచాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు సానుకూలంగా స్పందించారు.