విద్యుత్ షాకుతో రైతు మృతి
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ గ్రామానికి చెందిన పెద్దోళ్ల నడిపి భూమన్న అనే రైతు శనివారం తన పొలం వద్ద సాగు చేస్తున్న చెరుకుకు నీరు పెట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. పొలం వద్ద వ్యవసాయ బావిలోని విద్యుత్ మోటారు స్టార్ట్ చేసి నీరు పట్టే క్రమంలో విద్యుత్ షాక్ కు గురై మృతి చెందినట్టు స్థానికులు పేర్కొన్నారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.