భార్య కష్టం చూసి బండి కొన్న బిచ్చగాడు!

0 148,762

భార్య కష్టం చూసి ఓ బిచ్చగాడు బండి కొన్నాడు. వీధుల్లో అడుక్కునేందుకు తన భార్య చాలా ఇబ్బంది పడాల్సి వస్తోందని, అందుకే తన భార్య అవస్థను చూడలేక రూ.90 వేలు విలువ చేసే ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేశాడు. మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలోని అమరవార గ్రామంలో సంతోష్ సాహు అనే వ్యక్తి వీధుల్లో బిచ్చమెత్తుకునేవాడు. అంగవైకల్యం కారణంగా తాను ట్రై సైకిల్‌పై కూర్చుంటే తన భార్య అతడిని నెట్టుకుంటూ వెళ్లేది.

ఆ సమయంలో ఆమె చాలా అవస్థ పడేది. తన భార్య కష్టం చూసి సంతోష్ సాహు నాలుగేళ్లుగా ఒక్కొక్క పైస కూడబెట్టాడు. అలా రూ.90,000లు పోగు చేసి వాహనాన్ని కొనుగోలు చేశాడు. తన భర్త చేసిన పనికి భార్య మున్నీ సాహు ఎంతో ఆనందిస్తోంది. సంతోష్ సాహూ, మున్నీలు ప్రతిరోజూ బస్టాండ్‌లు, ఆలయాలు, మసీదుల దగ్గర బిచ్చమెత్తుకుంటారు. అలా రోజుకు రూ.300ల నుంచి రూ.400ల వరకు వాళ్లు సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఆ జంట మోపెడ్‌లో తిరుగుతూ బిక్షాటన చేయడంతో వార్తల్లోకెక్కారు.

భార్య కష్టం చూసి బండి కొన్న బిచ్చగాడు!

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents