అంబేద్కర్ క్లబ్ అభివృద్దికి 10 లక్షల నిధులు మంజూరు చేసిన మంత్రి గంగుల
కార్కనగడ్డ అంబెడ్కర్ క్లబ్ అభివృద్ధి కి కట్టుబడి ఉన్నామని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి వర్యులుకమలాకర్ పేర్కొన్నారు.. గత ఎన్నికలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు… మాట ఇస్తే తప్పనని నిరూపించుకున్నారు. కరీంనగర్ అంబేద్కర్ మెమోరియల్ క్లబ్ అభివృద్ది కోసం 62 లక్షల నిధులను ఇస్తానని గతంలో మాట ఇచ్చిన మంత్రి గంగుల కమలాకర్…. ఇప్పటికే 52 లక్షల రూపాయలను విడుదల చేశారు. ఇప్పుడు సిడిపి నిధుల నుండి మిగిలిన 10 లక్షల రూపాయలకు సంబంధించిన ప్రోసీడింగ్స్ ను అంబేద్కర్ మెమోరియల్ క్లబ్ ప్రతినిథులకు అందజేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుని 62 లక్షల రూపాయల నిధులను విడుదల చేసిన మంత్రి గంగుల కమలాకర్ కు అంబేద్కర్ మెమోరియల్ క్లబ్ అధ్యక్షులు కొంపల్లి రమణ్ కృతజ్ఞతలు తెలిపారు. తామెప్పుడు అభివృద్దిని కాంక్షించే వారిమని… అభివృద్ది ప్రదాత గంగుల వెంటే ఉంటామని స్పష్టం చేశారు. ఇందుకోసం సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు.