హీరోయిన్లు దానికి ఒప్పుకుంటారు: డైరెక్టర్
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అంశం తీవ్ర దుమారం రేపింది. హాలీవుడ్ మొదలు కొని వివిధ ప్రాంతీయ భాషల్లో ఇండస్ట్రీ వరకు ఈ ఉద్యమం పాకింది. చాలా మంది తమకు ఎదురైన అనుభవాలను బయట పెడుతున్నారు. అయితే ఓ తెలుగు సినీ డైరెక్టర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. కోకిల, కీచురాళ్లు, సంకీర్తన సినిమాలకు దర్శకత్వం వహించిన గీతాకృష్ణ ఓ యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ క్యాస్టింగ్ కౌచ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా అవకాశాల కోసం చాలా మంది టాలీవుడ్ హీరోయిన్లు కమిట్‌మెంట్ అడిగితే ఒప్పుకుంటారని అన్నారు.
ఈ కమిట్‌మెంట్ కల్చర్ సింగర్లకు కూడా తప్పదన్నారు. అయితే అందరూ అలా ఉండరని, కేవలం 15 శాతం మంది ప్రలోభాలకు లొంగరని గీతాకృష్ణ చెప్పారు. మిగిలిన వారంతా కమిట్‌మెంట్ ఒప్పుకునేలా పరిస్థితులు ఉంటాయని చెప్పారు. కమిట్‌మెంట్‌కు ఒప్పుకుంటేనే సినిమా అవకాశాలు వస్తాయని, అందుకే సినీ ఇండస్ట్రీ అమ్మాయిలకు సేఫ్ కాదని పేర్కొన్నారు. ఇక పలు అంశాలపై స్పందిస్తూ, తీవ్ర విమర్శలను గీతాకృష్ణ చేవారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.