దళిత బందు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

0 910

ప్రభుత్వం అందిస్తున్న దళిత బంధు పథకాన్ని లబ్ధిదారులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోని ఆర్థిక స్థిరత్వం సాధించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ జి రవి లబ్ధిదారులకు సూచించారు. మంగళవారం కోరుట్ల నియోజకవర్గంలోని ప్రాధమికంగా 69 దళిత బందు లబ్ధిదారులకు మెట్పల్లి ప్రాంతంలో నిర్వహించిన యూనిట్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.

దళిత బంధు పథకం పైలెట్ ప్రాజెక్టు కింద ప్రతి నియోజకవర్గ పరిధిలో 100 మంది లబ్ధిదారులను స్థానిక ఎమ్మెల్యేలు ఎంపిక చేసి, వారికి పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. జగిత్యాల జిల్లాలో కోరుట్ల నియోజకవర్గం పరిధిలో 100 మంది లబ్ధిదారుల జాబితాను అందరికంటే ముందు ఎమ్మెల్యే అందజేశారని కలెక్టర్ తెలిపారు. కోరుట్ల నియోజకవర్గం పరిధిలో 33 మంది లబ్ధిదారులకు ట్రాక్టర్లు, 33 మంది లబ్ధిదారులకు ప్యాసింజర్ వాహనాలు , 3 లబ్ధిదారులకు రిటైల్ సెక్టార్లో యూనిట్లను ఈరోజు పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.

దళిత బందు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

దళిత బంధు పథకం పైలెట్ ప్రాజెక్టు కింద జిల్లాలో మొత్తం 345 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని, 118 మంది లబ్ధిదారులకు యూనిట్లను పూర్తిస్థాయి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి గారి చే అందజేశామని కలెక్టర్ అన్నారు. జిల్లాలో మరో 138 మంది దళిత బందు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో నిధులు జమ చేసి, రూ. 30 వేలు విడుదల చేసేందుకు అనుమతులు జారీ చేశామని కలెక్టర్ తెలిపారు. మండలాల్లో దళిత బంధు యూనిట్ల గ్రౌండింగ్ పురోగతి మేరకు మిగిలిన నిధుల విడుదలకు బ్యాంకులకు ఆదేశాలు జారీ చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సీఎం కేసీఆర్ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 1500 మంది లబ్ధిదారులకు దళిత బంధు పథకం అమలు చేయాలని నిర్ణయించారని కలెక్టర్ అన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న యూనిట్ల స్థాపించి దళితులు ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ సూచించారు. ప్రతి లబ్ధిదారులు ట్రాక్టర్లు, వాహనాలను మాత్రమే కొనుగోలు చేస్తే వ్యాపార అవకాశాలు చాలా దెబ్బతింటాయని, మన ఎదుగుదల పై ప్రభావం చూపుతుందని దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.

ప్రతి దళిత బంధు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో రూ. 9. 9 లక్షల నిధులు జమ చేస్తామని, మిగిలిన రూ. 10వేలకు ప్రభుత్వం మరో 10వేలు జమ చేసి దళిత రక్షణ నిధి ఏర్పాటు చేస్తుందని కలెక్టర్ అన్నారు దళిత బంధు లబ్ధిదారులు భవిష్యత్తులో మరోసారి పేదరికంలోకి వెళ్లకుండా ఆపద సమయంలో దళిత రక్షణ నిధి ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ. డి. ఎస్సి కార్పొరేషన్ లక్ష్మీనారాయణ, 4 మండలాల జెడ్పిటిసిలు, ఎం. పి. పి. లు, ఎం. పి. టి. సి. లు, సర్పంచ్ లు, సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents