అభివృద్ధి చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు రాద్దాంతం: ఎమ్మెల్యే
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు, సింగరేణి కార్మికులకు కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా అందించడం కోసం మెడికల్ కళాశాల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని తాను తపన పడుతుంటే, కళాశాల నిర్మాణానికి ఆటంకం కలిగించాలని, అడ్డంకులు సృష్టించాలని జాతీయ పార్టీల నాయకులు, గత పాలకులు రాక్షస రాజకీయం చేస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే, టిఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ ఆరోపించారు. మంగళవారం గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అదనపు 50 పడకల విభాగాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, జడ్పీటీసీ ఆముల నారాయణ కార్పొరేటర్లు దాతు శ్రీనివాస్, కవితా సరోజిని, నాయకులు తోడేటి శంకర్ గౌడ్, బొడ్డు రవీందర్, తిరుపతి నాయక్, నూతి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.