వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు
జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు దిగువ ప్రాంతంలోని ఓ గృహంలో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో ఎస్ఐ చిరంజీవి తన సిబ్బందితో శనివారం దాడులు నిర్వహించారు. వ్యభిచారం నిర్వహిస్తున్న జగిత్యాల పాతబస్ స్టాండ్ ప్రాంతానికి చెందిన మహిళ(36), విటున్ని అదుపులోకి తీసుకున్నారు.
వ్యభిచారం చేస్తూ పట్టుబడిన ముగ్గురు మహిళలకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇంటి యజమాని మోహన్ రావు, గదిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళలు, విటుడిపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. పట్టుబడిన విటుడు పోలీస్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడని పేర్కొన్నారు.