పెండింగ్ కేసులపై పోలీసులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి: డిజిపి

0 2,469

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి ఆదేశించారు. జిల్లా ఎస్పీలతో, కమిషనర్ లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన రాష్ట్ర స్థాయి నేర సమీక్షా సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ పెండింగ్ కేసులు, క్రైమ్ ఎగినెస్ట్ ఉమెన్, ఎస్సీ ఎస్టీ, గ్రెవ్ కేసులపై పోలీస్ అధికారులు తీసుకొన్న ప్రత్యేక చోరవతో పెండింగ్ కేసుల్లో పురోగతి సాధించారని అన్నారు.

కొత్త కేసులతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్ కేసులను సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశగా అన్ని స్థాయిల అధికారుల పని చేయాలన్నారు. కోర్టు కేసులలో నిందితులకు శిక్షలు పడే విధంగా ట్రయల్ సమయంలో పోలీసు అధికారులు సంబంధిత కోర్టులకు వెళ్లి గ్రేవ్, నాన్ గ్రేవ్, మహిళలకి సంబంధించిన కేసులలో సాక్ష్యలను మోటివేట్ చేయాలని సూచించారు. కోర్టు స్టే ఉన్న కేసుల్లో జిల్లా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని సంబంధిత కోర్ట్ లకు హాజరై కేసును త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉండాలని ప్రతి కేసుకు సంబంధించి పురోగతి రాయాలని దీనికి సంబంధించి డీఎస్పీలు, యూనిట్ ఆఫీసర్లు పర్యవేక్షించాలని సూచించారు. సాంకేతికతను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ నేరాలపై నిఘా పెంచాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. గంజాయి పూర్తి స్థాయి లో నిర్మూలించడానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

పెండింగ్ కేసులపై పోలీసులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి: డిజిపి

ఫంక్షనల్ వర్టికల్ వారిగా జిల్లా స్థాయిలో ప్రతిరోజూ మానిటర్ చేయాలని సూచించారు. ఎస్. హెచ్. ఓ. లు, రిసెప్షన్, బ్లూ కోట్స్, పెట్రో కార్స్, స్టేషన్ రైటర్లు, క్రైమ్ రైటర్లు, క్రైం సిబ్బంది, కోర్టు డ్యూటీ ఆఫీసర్స్, వారెంట్, సమన్స్ సిబ్బంది, టెక్ టీమ్, 5 ఎస్, మెడికల్ సర్టిఫికెట్స్, ఎఫ్. ఎస్. ఎల్. , సెక్షన్ ఇంచార్జ్, ఐఓలు, జనరల్ డ్యూటీ సిబ్బందికి సంబందించిన వర్టీకల్స్ పై డీజీపీ సమీక్ష నిర్వహించారు.

వర్టికల్స్ వారిగా సిబ్బంది పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వారం లో ఒక రోజు సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. ఫంక్షనల్ వర్టీకల్స్ పకడ్బందీగా అమలు చేయడానికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్న యూనిట్ అధికారులను, వర్టీకల్స్ అధికారులను ప్రత్యేకంగా అభినందించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీ రూపేష్, ఎస్బి డీఎస్పీ రవీంద్ర కుమార్, ఏ వో అమర్నాథ్, ఎస్బి, ఐటీ కోర్, డి సీ ఆర్ బి ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, సరిలాల్ , దుర్గ, సిబ్బంది పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents