కామంతో చూస్తున్నాడని బాలుడిపై 32 ఏళ్ల మహిళ కంప్లైంట్… ఇద్దరికీ పెళ్లి చేసిన సర్పంచ్

0 84,139

గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలుడు తనని కామంతో చూస్తున్నాడని 32 ఏళ్ల మహిళ గ్రామపంచాయతీలో కంప్లైంట్ చేసింది. అయితే, గ్రామపెద్దలంతా కలిసి పంచాయతీ పెట్టి ఆ మహిళకు, బాలుడికి పెళ్లి చేశారు. దీంతో బాలుడి తండ్రి అధికారులను ఆశ్రయించాడు. సంబంధిత అధికారులు రంగంలోకి దిగడంతో బాలుడిని తీసుకుని ఆ మహిళ, ఆమె కుటుంబ సభ్యులతో పరారయ్యింది. ఇందుకు సంబంధించి ఇతర మీడియాలో వచ్చిన కథనం ప్రకారం….

Also Read :

Mother of two children fell in love with a minor, Boy says, 'Aunty do this  thing' | NewsTrack English 1

మధ్యప్రదేశ్ భోపాల్ లోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తికి(బాధిత బాలుడి తండ్రి), ఆ గ్రామ సర్పంచ్ మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో అతడిపై గ్రామ సర్పంచ్ పగ పెంచుకున్నాడు. ఇందుకోసం భర్తకు విడాకులిచ్చిన ఓ మహిళను రంగంలోకి దించాడు. తనవైపు ఆ బాలుడు కామంతో చూస్తున్నాడంటూ గ్రామపెద్దలకు ఆ మహిళ కంప్లైంట్ చేసింది.

ఈ విషయమై గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టారు. అనంతరం ఆ బాలుడికి, ఆ మహిళకు పెళ్లి చేశారు. దీంతో ఆ బాలుడి తండ్రి సంబంధిత అధికారులను ఆశ్రయించాడు. అధికారులు రంగంలోకి దిగడంతో ఆ మహిళ బాలుడు, ఆమె కుటుంబ సభ్యులతో పరారయ్యింది. ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నవారిపై కేసులు నమోదు చేసి గాలిస్తున్నట్లు సమాచారం.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents