నిత్య జీవితంలో “యోగా” ఒక భాగం కావాలి…
జిల్లా అదనపు పాలనాధికారి జీవి శ్యాం ప్రసాద్ లాల్
నిత్య జీవితంలో “యోగా” ఒక భాగం కావాలి…
జిల్లా అదనపు పాలనాధికారి జీవి శ్యాం ప్రసాద్ లాల్
నిత్యజీవితంలో యోగ ఒక భాగం కావాలని కరీంనగర్ జిల్లా అదనపు పాలనాధికారి జీవి శ్యాం ప్రసాద్ లాల్ అన్నారు .అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకునిప్రజ్ఞ భారతి- కరీంనగర్, వివేకానంద విద్యానికేతన్ విద్యాసంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న యోగా కార్యక్రమాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా అదనపు పాలనాధికారి జీవి శ్యామ్ ప్రసాద్ లాల్ మాట్లాడుతూ మనిషి తాను నూటికి 90 శాతం ఇతరుల కోసం, సమాజం కోసం ,తన కుటుంబం కోసం జీవించినప్పటికీ తనకోసం, తన శరీరం కోసం కనీసం పది శాతాన్ని కేటాయించుకోవాలని, ఈ ఆధునిక జీవనంలో మనిషి ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నాడనీ ఆ సమస్యలకు చక్కని పరిష్కారం యోగా మాత్రమేనని, కాబట్టి యోగ మనిషి నిత్య జీవితంలో ఒక భాగం కావాలని వారు పేర్కొన్నారు.
ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప సంజీవని యోగ అని, కులమతాలకతీతంగా ప్రతి ఒక్కరూ యోగాను అభ్యసించి శారీరక, మానసిక ఆరోగ్యాలను మెరుగుపరుచుకోవాలని, కనీసం ప్రతిరోజు ఒక గంట యోగా కోసం కేటాయించాలని వారు సూచించారు.
మనసు,శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనిషి దేన్నైనా సాధిస్తాడని, మానసిక,శారీరక ఆరోగ్యాన్ని అందించేది కేవలం యోగా మాత్రమేనని, మన ఋషులు, మునులు యోగాను మనకు అందించి మన దేశ కీర్తిని ప్రపంచపటంపై నిలబెట్టేలా మన పూర్వులు అందించిన అమృత ఔషధం యోగ అని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజ్ఞాభారతి జిల్లా అధ్యక్షులు సిఎ. డి. నిరంజనాచారి మాట్లాడుతూ యోగం అంటే కలయిక అని, మనస్సును,బుద్ధిని ఏకంచేసేది యోగా అని, చాలా సంవత్సరాలుగా ప్రజ్ఞాభారతి యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నదని, ప్రజలందరికీ ఆరోగ్యమే ప్రజ్ఞాభారతి లక్ష్యమని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజ్ఞాభారతి ప్రధాన కార్యదర్శి
మందల నగేష్ రెడ్డి, గాజుల రవీందర్,దేశిని శ్రీనివాస్, నంది శ్రీనివాస్, వివేకానంద పాఠశాలల ఏఓ తుంగాని సంపత్, సౌగాని అనుదీప్, శిక్షకులు కుమ్మరికుంట సుధాకర్, గీకురు శ్రీనివాస్, అంతర్జాతీయ యోగా దినోత్సవం జిల్లా కన్వీనర్ కన్నె కృష్ణ, కో కన్వీనర్ కళ్ళెం వాసుదేవ రెడ్డి, పెద్దపల్లి జితేందర్, దుబ్బాల శ్రీనివాస్, బల్బీర్ సింగ్, జాడి బాల్ రెడ్డి, జానుపట్ల స్వామి,బొంతల కళ్యాణ్ చంద్ర, నరహరి లక్ష్మారెడ్డి, ఆవుదుర్తి శ్రీనివాస్, తణుకు సాయి కృష్ణ, బండ రమణారెడ్డి, ఎడమ సత్యనారాయణ రెడ్డి, కలికోట మోహన్, మేడిశెట్టి నవీన్,బెళ్ళం నరేందర్ తదితరులు పాల్గొన్నారు