యోగా మానసిక, శారీరక రుగ్మతలకు దూరం

-అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్

0 2,186

ఈనెల 21న కరీంనగర్ లో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ పిలుపు నిచ్చారు. గురువారం అంతర్జాతీయ యోగా దినోత్సవం లో భాగంగా ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన శోభయాత్రను జ్యోతిబాపూలే పార్కు వద్ద ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి నిత్యం యోగా చేయడం ద్వారా మానసిక శారీరక రుగ్మతలు దూరం అవుతాయని పేర్కొన్నారు. యోగాపై విస్త్రుత ప్రచారం చేయాని సూచించారు.
ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ జువేరియా, ఆర్ డిడి రవి నాయక్, డిపిఒ రవీందర్, నేచురోపతి మెడకల్ ఆఫీసర్ పి.రజిత, మెడికల్ ఆఫీసర్లు యస్రుబ్ సుల్తాన, విశ్వంబర్, ఆర్ వెంకటేశ్వర్, యువభారత్ రాష్ట్ర అధ్యక్షుడు ముత్యాల రమేష్, పతంజలి బాధ్యులు బి. లక్ష్మి నారాయణ, యువభారత్ జిల్లా అధ్యక్షుడు కొండా లక్ష్మణ్ బాబులతో పాటు లయన్స్ క్లబ్ సభ్యులు, ఆశలు, ఆయుర్వేద, యునాని, హోమియోపతి, నాచురోపతి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Also Read :

నృత్య కారిణిని అవార్డ్

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents