దుకాణాలను చైతన్యపురి కూరగాయల షెడ్ లోకి తరలించండి

-అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్

0 1,953

నగరంలోని రోడ్లు, ఫుట్ పాత్ లపై వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు వాటిని తొలగించాలని వ్యాపారులను అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ సూచించారు. గురువారం అదనపు కలెక్టర్ కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల ముందు రోడ్లపై, ఫుట్ పాత్ లపై కూరగాయలు, పండ్లు అమ్ముతున్న వ్యాపారులను కలసి తమ యొక్క కూరగాయల దుకాణాలను రోడ్లు , ఫుట్ పాత్ లపై నుండి తొలగించి చైతన్యపురిలోని కూరగాయల షెడ్ లోకి తరలించాలని వ్యాపారులు ఆదేశించారు.ఈ సమావేశంలో మున్సిపల్ కమీషనర్ సేవా ఇస్లావత్, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ రవీందర్, డిసిపి సుభాష్, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Also Read :

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents