టిఎన్ఎస్ఎఫ్ నాయకులను అక్రమ అరెస్ట్..

0 4,287

బాసర ఐఐఐటీ విద్యార్ధులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే వరకు TNSF పోరాటం చేస్తోంది అని టిఎన్ఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్ అన్నారుఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ* బాసర ఐఐఐటి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలి అని గత రెండు రోజులుగా వర్షాన్ని కూడా లెక్క చేయక రాత్రి,పగలు విద్యార్థులు ధర్నా చేస్తుంటే ఈ ముఖ్యమంత్రి కెసిఆర్ కు చలనం లేదు అని అన్నారు..సుమారు 8000 మంది విద్యార్థులు ధర్నా చేస్తుంటే సంబంధిత మత్రులు క్యాంపస్ కి వచ్చి విద్యార్థులకు హామీ ఇవ్వకపోవడం బాధాకరం, ఎన్నో సంవతసరాల తెలంగాణ రాష్ట్ర స్వప్నన్ని సాకారం చేసిన విద్యార్థుల పట్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మొదటి నుండి చిన్నచూపే అని అన్నారు, ఇప్పటికైనా ఐఐఐటి విద్యార్థుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి అని లేని పక్షంలో టిఎన్ఎస్ఎఫ్ అధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తాం అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ అదిలాబాద్ పార్లమెంట్ అద్యక్షులు పోల్కర్ సాయిరాం, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సచిన్ పటేల్, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి యూసుఫ్,టిఎన్ఎస్ఎఫ్ నాయకులు మహేష్, పృథ్వి, సన్నీ అవత్, షేక్ వసీమ్ ఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు..

Also Read :

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents