130 గ్రాముల గంజాయి పట్టుకున్న సుల్తానాబాద్, టాస్క్ ఫోర్స్ పోలీసులు
రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాట్నాపల్లి గ్రామం రైస్ మిల్ ఉన్న ప్రాంతం లో అమర్ దీప్ అనే బీహార్ కి చెందిన వ్యక్తి టీ స్టాల్ లో గంజాయి అవుతున్నాడని నమ్మదగిన సమాచారం మేరకు అక్కడికి వెళ్లి టాస్క్ఫోర్స్ సుల్తానాబాద్ పోలీసులు తనిఖీ చేయడం అతనివద్ద 130 గ్రాముల గంజాయి ప్యాకెట్ దొరకడం జరిగింది. ఇట్టి నిందితుడు గతంలో కూడా గంజాయి అమ్ముతూ పట్టుబడడం జరిగింది. నిందితుడిని అదుపులోకి తీసుకొని గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ నిమిత్తం సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగింది.ఇట్టి టాస్క్ లో టాస్క్ ఫోర్స్ సిబ్బంది చంద్ర శేఖర్, సునీల్, సుల్తానాబాద్ సిబ్బంది తిరుపతి, రాజు లు పాల్గొన్నారు.