రైతుల దీక్ష 100 సందర్భంగా మద్దతు
తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు రణం రవన్న,
కరీంనగర్ః రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామం లో రైతులు చేస్తున్న నిరవధిక దీక్షకు 100 వందరోజుల సందర్భంగా మద్దతు తెలపడానికి సిపిఐ ఎంఎల్ పార్టీ తెలంగాణ రైతు కూలి సంఘం
ప్రగతిశీల యువజన సంఘంసంపూర్ణ మద్దతు ప్రకటించాయి రైతులు చేస్తున్న దీక్ష న్యాయబద్ధమైన దీక్ష రైతులకు భూమికి బదులు భూమి ఇవ్వమని రైతులు చేస్తున్న డిమాండ్ న్యాయమైనది లేదంటే బహిరంగ మార్కెట్ కంటే రెండు రెట్లు ఎక్కువ నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు లేని యెడల పాత కాలువ వెడల్పు చేస్తే సరిపోతుందని శాస్త్రవేత్తలు ఇంజనీర్లు చెబుతున్నారు దీన్ని కాదని కమీషన్ల కోసమే రాజకీయ లబ్ధి కోసమే బడాబాబులు జేబులు నింపడానికి ఇది ఒక పెద్ద కుట్ర దీని వెనుక పెట్టుబడిదారీ వర్గం రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు కమీషన్ల కోసం కక్కుర్తి పడుతూ కాలువ అవసరం లేకున్నా తీయడానికి సిద్ధమవుతున్నారు ఇది సరైన పద్ధతి కాదని రైతులు బాధ వ్యక్తం చేసిన వినకుండా బలవంతపు భూసేకరణ సేకరణ చేస్తుంటే దానికి వ్యతిరేకంగా రైతులందరూ ఏకమయ్యే నిరవధిక దీక్ష చేస్తున్నారు దానికి మద్దతుగా వంద రోజులు నిండిన సందర్భంగా మద్దతు తెలపడానికి వచ్చిన నాయకులు తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు రణం రవన్న, జిల్లా కార్యదర్శి సోమిశెట్టి దశరథం, రాజన్న సిరిసిల్ల జిల్లా మశం ఆంజనేయులు, ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర నాయకులు గంగాధర సురేందర్, మాజీ సర్పంచ్ కనకయ్య బాధితులు రైతులు తదితరులు పాల్గొన్నారు