సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన సంఘటనకు…
-ఎన్ఎస్యూఐకి ఎలాంటి సంబంధం లేదు : కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన సంఘటనకు…
-ఎన్ఎస్యూఐకి ఎలాంటి సంబంధం లేదు
-కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా నిరసిస్తూ యువకుల ఆందోళనతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతపై కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ స్పందించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన సంఘటనకు ఎన్ఎస్యూఐకి ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటూ వెంకట్ ఓ వీడియో విడుదల చేశారు.ఆర్మీ నియామక పరీక్ష రద్దు కావడం వల్ల గత 48 గంటల్లో చాలా మంది అభ్యర్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో ఆవేశానికి లోనైన అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటనతో ఎన్ఎస్యూఐకి ఎటువంటి సంబంధం లేదు. అభ్యర్థుల నిరసనలో మాకు ప్రమేయం ఉన్నట్లు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించే కార్యకలాపాలను ఎన్ఎస్యూఐ చేయబోదు. నేను ఇవాళ ఉదయం ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూకి వెళ్తుండగా నన్ను పోలీసులు అరెస్టు చేసి నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం అక్కడ నుంచి షా ఇనాయత్ గంజ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అందుకే నేను పోలీస్ స్టేషన్లో ఉండి కూడా ఈ వీడియో ద్వారా స్పష్టం చేస్తున్నాను’’ అని బల్మూరి వెంకట్ వెల్లడించారు.