కరీంనగర్ నగర అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి
- జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్
కరీంనగర్ నగర అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి
– జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్
కరీంనగర్ ;
కరీంనగర్ నగరంలో రోడ్లు, సానిటేషన్, మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ అధికారులకు సూచించారు.శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ కమిషనర్, హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరంగల్ నగర అభివృద్ధికి 90 కోట్లు ఆర్థిక సహాయం ఇచ్చిన మాదిరిగా కరీంనగర్ నగరంలో రోడ్లు, సానిటేషన్, మౌలిక సదుపాయాల కల్పన తదితర అభివృద్ధి పనులు చేపట్టుటకు హెచ్డిఎఫ్సి బ్యాంకు ద్వారా ఆర్థిక సహాయంగా నిధులను మంజూరు చేయాలని కలెక్టర్ బ్యాంకర్లను కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ బ్యాంకు అధికారులతో బ్యాంకు ఆర్థిక సహాయం, తిరిగి చెల్లింపులు తదితర అంశాలపై చర్చించారు.ఈ సమావేశంలో కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ సేవ ఇస్లావత్ ,హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టేట్ హెడ్ శ్రావణ్ కుమార్, జోనల్ మేనేజర్ విశాల్ భాటీయా, రీజినల్ మేనేజర్ ముకుందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.