యోగ శారీరక సామర్థ్యాన్ని పెంచుతుంది

కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ

0 1,858

ప్రతి నిత్యం యోగా చేయడం ద్వారా శారీరక మానసిక సామర్థ్యం పెరిగి మనిషి ఉన్నత స్థితికి చేరుకోవడానికి దోహదపడుతుందని కరీంనగర్ వి. పోలీస్ కమిషనర్ సత్యనారాయణ అన్నారు.

8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం ఆయుష్ డిపార్ట్మెంట్, ఆధ్వర్యంలో నిర్వహించిన యోగ వాక్ లో పోలీస్ డిపార్ట్మెంట్, పతంజలి యోగ సమితి పాల్గొనగ ఆయన కలెక్టరేట్ వద్ద జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశంలో యువత అధికంగా ఉన్నారని యోగ సాధనతో శక్తివంతంగా తయారై వివిధ రంగాల్లో ముందంజలో ఉండవచ్చునని పేర్కొన్నారు. 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ నోడల్ ఆఫీసర్ డా‌. కె. సంజీవ్ కుమార్, డిప్యూటి నోడల్ ఆఫీసర్లు డా. విశ్వంబర్ , డా.భవాని ప్రసాద్, డాక్టర్ రజిత ,డా. యస్రుబ్ సుల్తాన, ఆర్ వెంకటేశ్వర్, రూరల్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కరుణాకర్ రావు , ట్రాఫిక్ పోలీస్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ ర్ సిఐలు, యువ భారత్ రాష్ట్ర అధ్యక్షుడు ముత్యాల రమేష్, పతంజలి బాధ్యులు కొండా లక్ష్మణ్ బాబు, నెహ్రూ యువ కేంద్ర రవీందర్,ఆశలు, ఆయుర్వేద, యునాని, హోమియోపతి, నాచురోపతి వైద్యులు, ఫార్మసిస్టులు, సిబ్బంది , పోలీస్ సిబ్బందితో పాటు స్టార్ డిఫెన్స్ అకాడమీ, శాతవాహన ఇనిస్టిట్యూట్, అయాన్, కెఎన్ఆర్, గౌతమ్ ఇనిస్టిట్యూట్, రా అకాడమీ పోటీ పరీక్షల అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents