తాటి చెట్టు పైనుంచి కిందపడి గీతా వృత్తిదారుడు మృతి
తంగళ్ళపల్లి మండలంలోని నర్సింహుళపల్లె గ్రామానికి చెందిన మంద అంజయ్య గౌడ్ (55) కల్లు గీయడానికి తాటి చెట్టు ఎక్కి ప్రమాదపుశాత్తు కింద పడి మరణించాడు. అంజయ్యకు భార్య, ఇద్దరు కొడుకులు. వీరి కుటుంబానికి సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంక్షేమ సంఘం తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తక్షణమే ఎక్సగ్రేషియా చెల్లించాలని సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తీగల శ్రావణ్ గౌడ్, తంగళ్ళపల్లి మండల యాత్ అధ్యక్షుడు వంగ ప్రదీప్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.