అదనపుజిల్లా పౌర సంబంధాల అధికారిణిగా బాధ్యతలు స్వీకరించిన జె.శారద
అభినందిస్తున్న జిల్లా కలెక్టర్ కె.శశాంక
కరీంనగర్ :జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, కరీంనగర్ లో సహాయ పౌర సంబంధాల అధికారిణిగా పనిచేస్తున్న శ్రీమతి జె.శారదకు శ్రీయుత కమీషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ, హైదరాబాద్ గారు అదనపు పౌర సంబంధాల అధికారిణిగా పదోన్నతి కల్పించినారు. కమీషనర్ గారి ఆదేశాల మేరకు శనివారం జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, కరీంనగర్ లో అదనపు పౌర సంబంధాల అధికారిణిగా పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది.
ఈ సందర్భంగా పదవి బాధ్యతలను స్వీకరించిన అనంతరం శ్రీమతి జె.శారద, అదనపు పౌర సంబంధాల అధికారిణీ జిల్లా కలెక్టర్ కె.శశాంకను మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ఆమెను అభినందించారు. గతంలో టైపిస్టు నుండి సహాయ పౌర సంబంధాల అధికారిణిగా ఈ కార్యాలయంలో పనిచేసి పదోన్నతి పొందడం జరిగినది.