‘అగ్నిపథ్’ మంచి స్కీమ్: బండి సంజయ్
‘అగ్నిపథ్’ చాలా మంచి స్కీమ్ అని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్‌లో శనివారం మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే సంఘ విద్రోహ శక్తులు రెచ్చిపోయాయన్నారు. ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పోలీసులు పట్టించుకోలేదన్నారు. అగ్నిపథ్‌పై నిరసన తెలిపే పద్ధతి ఇది కాదన్నారు. సికింద్రాబాద్ ఘటనలో రాళ్లు వేసింది ఎవరో తేల్చాల్సిన పని ఉందన్నారు.