ఆత్మ విశ్వాసమే ఉద్యోగ సాధన కు తొలి మెట్టు

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ సి పార్థసారథి

0 6

ఆత్మ విశ్వాసమే ఉద్యోగ సాధన కు తొలి మెట్టు

మీ భవిష్యత్తుకు మీరే మార్గ నిర్దేశకులు

ఏకాగ్రతతో చదివి సిలబస్ ను ఆకళింపు చేసుకోవాలి

ప్రభుత్వ కొలువు సాధించి బంగారు తెలంగాణ నిర్మాణంలో పాలు పంచుకోవాలి

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ సి పార్థసారథి

క‌రీంన‌గ‌ర్ ;

తెలంగాణ రాష్ట్రం జారీ చేసిన జిల్లా,జోనల్, మల్టీ జోనల్ స్థాయి ఉద్యోగాలను సాధించాలంటే నిరుద్యోగ యువత ఆత్మ విశ్వాసాన్ని కలిగి ఉండాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ సి .పార్థ సారథి తెలిపారు.శనివారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ ఆద్వర్యం లో నిర్వహించిన గ్రూప్ 1, ఎస్సై తదితర పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు కు అయన ముఖ్య అతిథి గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉద్యోగ నియామక అవకాశాలను అంది పుచ్చుకోవాలని, ప్రణాళికాబద్ధంగా చదివితే ఉద్యోగాన్ని సాధించవచ్చని తెలిపారు. కలలు కనడం తో పాటు వాటిని సాకారం చేసుకోవాలని అందుకు సరైన సమయ పాలన పాటిస్తూ సిలబస్ కు అనుగుణం గా ప్రిపేర్ కావాలని సూచించారు. పాత ప్రశ్న పత్రాలను విశ్లేషించుకోవాలని,పరీక్ష లో ప్రతీ ప్రశ్న, ప్రతీ మార్కు కీలకమేనని కావున ఏకాగ్రత తో, స్థిరత్వం తో ,విషయ పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటూ ప్రిపేర్ కావాలని సూచించారు. తాను కూడా గ్రామీణ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చానని, విద్యార్థులు ఆత్మ న్యూనత భావానికి లోను కాకుండా ఉద్యోగం సాధిస్తాననే నమ్మకంతో ప్రిపరేషన్ కొనసాగించాలని ఉద్యోగార్థులకు మార్గదర్శనం చేశారు. వేదిక పై నుండి దిగి అభ్యర్థుల మధ్యకు వచ్చి తనదైన శైలిలో కీలక సూచనలు చేస్తూ వారిలో స్ఫూర్తిని పెంపొందింప జేశారు. ఉద్యోగ సాధనకై పాటించాల్సిన పద్ధతులు, సన్నద్ధత తీరు గురించి అన్ని అంశాలను మేళవిస్తూ ఆకట్టుకునే రీతిలో విడమరచి చెప్పడం అభ్యర్థుల్లో ఆత్మస్థైర్యాన్ని ఇనుమడింపచేసింది. గ్రూప్స్ పరీక్షలు రాసే అభ్యర్థులు నిరాశ నిస్పృహలను దరిచేరనివ్వకుండా తాను ఎలాగైనా సాధిస్తానని గట్టి సంకల్పంతో కష్టపడితే ఆశించిన లక్ష్యం దానంతట అదే వస్తుందని అయన సూచించారు. మొహమాటం, బద్ధకం వంటి దురలవాట్లకు దూరంగా ఉంటూ మానసిక ఒత్తిడి ని జాయిస్తు ముందుకు సాగాలని హితవు పలికారు. ప్రస్తుతం ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతున్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఎంతో కీలకమైందని పేర్కొన్నారు. యువత కోరుకున్న కొలువు దక్కించుకొని బంగారు తెలంగాణ నిర్మాణం లో భాగస్వాములు కావాలని కమిషనర్ పిలుపునిచ్చారు. జిల్లాకు అత్యధిక కొలువులు దక్కేలా కృషి చేయాలని సూచించారు. కోచింగ్ తో ఇప్పటికే 50 శాతం విజయం సాధించగలిగారు అని ఇంకాస్త గట్టిగా కష్టపడితే జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చని సూచించారు. ప్రభుత్వ అధికారిగా హోదాను అనుభవిస్తూ ప్రజలకు సేవ చేస్తూ ఆత్మ సంతృప్తి పొందే అవకాశం కేవలం ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని లభిస్తుందని అన్నారు. పోటీ పరీక్షలకు సంబంధించి పరీక్షా విధానంలో సిలబస్ లో పెద్దగా తేడా ఉండదని విషయ పరిజ్ఞానం అవగాహన ముఖ్యం అని సూచించారు ఎన్ని గంటల పాటు చదివాను అని కాకుండా ఎంత చదివినా చదివిన అంశాలను పరీక్ష ఎలా రాశావు అన్నది అభ్యర్థులకు అవకాశం ఉందని పేర్కొన్నారు కష్టపడే వారే విజేతలు అవుతారని అన్నారు నేర్చుకున్న అంశాలను ఎప్పటికప్పుడు పున:శ్చరణ చేసుకుంటూ ఏవైనా లోటుపాట్లు ఉంటే సరి చేసుకోవాలని ఆయన సూచించారు చిన్న చిన్న అవరోధాలను అపజయాలను చూసి కుంగిపోకూడదు అని వాడిని విజయానికి మెట్లుగా వాడుకోవాలని హితవు పలికారు చేతులు లేని విషయాల గురించి ఆలోచిస్తూ సమయం వృధా చేయడం కంటే మనం చేయాల్సిన కర్తవ్యాన్ని పూర్తి స్థాయిలో నిర్వర్తించడం పైనే దృష్టి కేంద్రీకరించాలని హితబోధ చేశారు నిలకడ ఏకాగ్రత తో లక్ష్యాన్ని ఛేదించాలి అని కమిషనర్ పేర్కొన్నారు.జిల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్ గారు మాట్లాడుతూ జిల్లాలో వారధి సొసైటి, బిసి, ఎస్సి,ఎస్టి,మైనారిటి స్టడీ సర్కిల్స్ ద్వారా శిక్షణ ఇప్పిస్తున్నామని తెలిపారు. నిరుద్యోగ యువత కోసం తయారు చేసిన వారధి యాప్ ను వినియోగించుకోవాలని సూచించారు.సి పి సత్య నారాయణ గారు మాట్లాడుతూ మీ విజయం మీ చేతుల్లోనే ఉందని ,అనవసర అపోహలు,పుకార్లు నమ్మకుండా చదవాలని తెలిపారు.ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్, జెడ్పి సిఈవో ప్రియాంక, డిప్యూటి ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్, వారధి సొసైటి బాధ్యులు ఆంజనేయులు, ఎస్సి,ఎస్టి,బిసి, మైనారిటి సంక్షేమ శాఖ జిల్లా అధికారులు నేతానియల్, గంగారాం, రాజ మనోహర్, మధుసూదన్ మధుసూదన్ స్టడి సర్కిల్ డైరెక్టర్లు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents