నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం
-సీపీఐ జిల్లా కార్యదర్శి పొనగంటి కేదారి
నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం
-సీపీఐ జిల్లా కార్యదర్శి పొనగంటి కేదారి
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మోడీ ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని తెచ్చి దేశంలోని నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న మోడీ సర్కారు కు తగిన గుణపాఠం చెప్పాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పొనగంటి కేదారి ఒక ప్రకటనలో యువతకు పిలుపునిచ్చారు. అగ్నిపథ్ పథకాన్ని దేశ వ్యాప్తంగా అనేక రాష్ర్టాల్లో వ్యతిరేకిస్తున్నా మోడీకి చీమకుట్టినట్లు కూడా లేకపోవడం సిగ్గుచేటని, ఈ పథకం వల్ల యువకులకు ఎలాంటి ఉపయోగం లేదని,కాంట్రాక్టు పద్ధతిన ఆర్మీ రిక్రూట్ మెంట్ చేయడం వల్ల దేశ ప్రయోజనాలు,భద్రత కు ముప్పువాటిల్లే ప్రమాదం ఉందని,వృతి నైపుణ్యాల తో సాయుధ బలగాల సామర్థ్యం పెంచడం సాధ్యం కాదని,రెండు సంవత్సరాలుగా భారత ఆర్మీలో సైనికుల రిక్రూట్ మెంట్ లేకపోవడంతో అనేక మంది నిరుద్యోగులు ఎన్నో ఆశలతో తమకు అవకాశం వస్తుందని ఎదురుచూస్తున్న ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఆర్మీపథ్ తేవడం మూలంగా ఒక్కసారిగా నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అయిందని దేశ వ్యాప్తంగా ఈ పథకానికి వ్యతిరేకంగా తమ నిరసన తెలియజేశారని,అందులో భాగంగానే నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దురదృష్టవశాత్తు సంఘటన జరిగిందని,ఆ సంఘటనలో మృతి చెందిన కుటుంబాలను కేంద్రం ఆదుకోవాలని,గాయాలపాలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని,ఆర్మీపథ్ పథకాన్ని తక్షణమే రద్దు చేయాలని కేదారి డిమాండ్ చేశారు