ఏఐఎఫ్ బీ పార్టీ ఆవిర్బావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలి
పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి
ఏఐఎఫ్ బీ పార్టీ ఆవిర్బావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలి
పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడుఅంబటి జోజిరెడ్డి
జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంల పలువురి చేరిక
జిల్లా వ్యాప్తంగా జూన్ 22న ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆవిర్బావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం కరీంనగర్ లోని పార్టీ కార్యాలయంలో జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిధిగా ఏఐఎఫ్ బీ రాష్ట్ర ఉపాధ్యక్షడు అంబటి జోజిరెడ్డి హాజరయ్యారు. ఈ సంధర్బంగా జూన్ 22 పార్టీ ఆవిర్బావ దినోత్సవ కార్యక్రమాలు, ఫిబ్రవరిలో నిర్వహించే నేషనల్ కాన్ఫరెన్స్, పార్టీ బలోపేతం, కమిటీలు, అనుబంధ విభాగాల నియామకం, చేపట్టబోయే ప్రజోపయోగ కార్యక్రమాలు తదితర అంశాలపై విస్త్రతంగా చర్చించారు. ఈ సంధర్బంగా కరీంనగర్ లోని పార్టీ వివిధ విభాగాల ఆద్వర్యంలో పలు ప్రాంతాలలో పార్టీ జెండా ఆవిష్కరణలకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని, పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతీ కార్యకర్త క్రుషి చేయాలన్నారు. పార్టీలో చేరికలపై ప్రత్యేక ద్రుష్టి సారించాలన్నారు. ఆగస్టు, సెప్టెంబర్ లోగా ఏఐఎఫ్ బీ జిల్లా కమిటీలు పూర్తి చేయాలన్నదే పార్టీ లక్ష్యమన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 వేల క్రియాశీలక సభ్యత్వాలు చేపట్టాలన్నారు. పార్టీ అనుబంధ విభాగాల కమిటీల నియామకాలను త్వరలోనే పూర్తి స్థాయిలో నియామకాలు చేపడతామన్నారు. రానున్న మూడు నెలల్లో వర్షాకాలంతో నెలకొనే సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, ప్రజోపయోగ కార్యక్రమాలు విస్త్రతంగా చేపట్టాలని పిలుపునిచ్చారు. పార్టీ నియమ నిబంధనలను, సమయపాలనను ఉలంఘించకూడదని కోరారు. ఈ సంధర్బంగా పలువురు పార్టీలో చేరగా వారికి అంబటి జోజిరెడ్డి కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో లింగమూర్తి, బి. రాజయ్య, ఎ. చందులున్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పులిమాటి సంతోష్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు అయిల ప్రసన్న, ట్రేడ్ యూనియన్ జిల్లా కన్వీనర్ శంకర్ కురువెల్లి, అనుబంధ సుతారి సంఘం అధ్యక్షుడు బెక్కంటి రమేశ్, నాయకులు పెద్దెల్లి శేఖర్, లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.