జూలై 1 నుండి ప్ర‌జాకోర్టు

రిటైడ్ పోలీస్ అదికారి దాస‌రి భూమ‌య్య కీల‌క నిర్ల‌యం

0 31

జూలై1 ప్ర‌జాకోర్టునుండి
ఉమ్మ‌డి జిల్లా ప్ర‌తి మండ‌లాల్లో స‌భ‌లు
ప్ర‌జ‌ల ముందే అధికారుల నిర్లక్ష్యం.. అవినీతి చ‌ర్చ‌లు
రిటైడ్ పోలీస్ అధికారి దాస‌రి భూమ‌య్య కీల‌క నిర్ల‌యం

క‌రీంన‌గ‌ర్ :

Also Read :

క‌రీంన‌గ‌ర్ ఉమ్మ‌డి జిల్లా వ్యాప్తంగా జూలై1 నుండి ప్ర‌తి మండ‌ల కేంద్రాల్లో ప్ర‌జాకోర్టు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు రిటైడ్ పోలీస్ అధికారి దాస‌రి భూమ‌య్య కీల‌క నిర్ల‌యం తీసుకున్నారు. ఆయ‌న విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ తెలంగాణ పాల‌న‌లో సీఎం కెసిఆర్‌, కెటిఆర్ లు చేప‌డుతున్న ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు నేరుగా ప్ర‌జ‌ల్లోకి చేర‌డం లేదన్నారు. సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌జ‌ల‌కు అంద‌డంలో మ‌ధ్య దళారులు ఎక్కువై పోయారని అన్నారు. కొంద‌రు ప్ర‌భుత్వ అధికారులు, పాల‌కులు అవినీతికి,నిర్ల‌క్ష్యానికి పాల్ప‌డుతున్నారని పేర్కొన్నారు. అధికారులు, పాల‌కుల నిర్ల‌క్ష్యాన్ని ఎండ గ‌ట్టేందుకు జులై1 నుండి ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లా వ్యాప్తంగా ప్ర‌తి మండ‌ల కేంద్రంలో ప్ర‌జాకోర్టులు పెడుతానని పేర్కొన్నారు. ప్ర‌జాకోర్టులో ప్ర‌జ‌లు త‌మ దృష్టికి తీసుకువ‌చ్చిన విష‌యాల‌ను సీఎం కు, ప్ర‌భుత్వానికి ఒక నివేధిక రూపంలో పంపుతాన‌ని తెలిపారు. . క్షేత్ర స్థాయిలో అస‌లు ఏం జ‌రుగుతుందో కెసిఆర్‌, కెటిఆర్ ల‌కు తెలియ‌జేయాల‌నే సంక‌ల్పంతో ఈ ప్ర‌జాకోర్టు కార్య‌క్ర‌మాన్ని తాను తీసుకుని ముందుకు పోతున్నాన‌ని, తాను చేప‌ట్టే ప్ర‌జాకోర్టు కార్య‌క్ర‌మానికి అధికారులు, ప్ర‌భుత్వం చేయూత‌నిస్తుంద‌ని అన్నారు. గొర్రెల ప‌థ‌కం. బ‌ర్రెల ప‌థ‌కం, క‌ళ్యాణ లక్ష్మీ, సాధీ ముభార‌క్ లాంటి ఎన్నో వివిధ సంక్షేమ ప‌థ‌కాల‌లో కొంద‌రు అవిన‌తికి పాల్ప‌డి అందినంత దంటుకుంటున్నార‌నే త‌న దృష్టికి వ‌చ్చింద‌న్నారు. అలాగే అక్ర‌మ బూదందాలు, ల్యాండ్ మాఫియాలు, సెటిల్‌మెంట్స్‌, అక్ర‌మ ఇసుక ర‌వాణా, బెల్ట్ ఫాపులు, ఇలా అనే అంశాల‌ల‌పై ప్ర‌జాకోర్టులో ప్ర‌జ‌ల‌తో సుదీర్గంగా చ‌ర్చించి నివిధిక‌ను ప్ర‌భుత్వానికి పంప‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. జూలై1న కొహెడ మండ‌లంలో ప్రారంభ‌మైన ఈ ప్ర‌జాకోర్టు కార్య‌క్ర‌మం 60 రోజుల పాటు నిర్వ‌హించి కాళేశ్వ‌రంలో ముగించ‌నున్న‌ట్లు వివ‌రించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents