. అక్రమంగా అరెస్ట్ చేయడం హేయమైన చర్య
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపత్ రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ జాతీయ కమిటీ ఎస్ఎఫ్ఐ జాతీయ కార్యదర్శి మైయుకు బిశ్వాస్, జాతీయ కార్యదర్శి రహీం రాజ్యసభ సభ్యులు మరియు నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం నిరసిస్తూ జాతీయ కమిటీ పిలుపు మేరకు మంకమ్మ తోట లో నిరసన చేయడం జరిగింది..
ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి శనిగరపు రజినీకాంత్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది గతంలో దేశంలో రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి రైతులను ఇబ్బంది పెట్టింది ఇప్పుడు కాంట్రాక్ట్ పద్ధతిలో సాయుధ బలగాల తీసుకరావడం సిగ్గుచేటు దేశవ్యాప్తంగా 2021 సంవత్సరం లో ఆర్మీ ర్యాలీ నిర్వహించి 15 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు కూడా రాత పరీక్ష నిర్వహించడం లేదు అగ్నిపత్ స్కీమ్ తీసుకువచ్చి రాత పరీక్ష లేదు అని ప్రకటించడం వలన అన్ని రాష్ట్రాలలో యువత ఆగ్రహం చెంది రైల్వేస్టేషన్లలో నిరసన చేయడం జరిగింది దీనికి కారణం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం అని మండిపడ్డారు దీన్ని వ్యతిరేకిస్తూ చలో పార్లమెంటు కార్యక్రమం చేస్తున్న జాతీయ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు బిజెపి ప్రభుత్వం రోజురోజుకు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తూనారు, ఈ స్కీమ్ వల్ల దేశ యువతకు చాలా ఉపయోగం అని ప్రచారం చేస్తున్నారు ఒకవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఈ స్కీం వల్ల యువతకు బట్టలు ఉతకడం, వంటలు చేయడం నేర్పిస్తా మని మరియు బీజేపీ ఆఫీస్ లకు కాపలా పెట్టుకుంటామని మాటలు మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. దేశ సేవ చేయడం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వెళ్తున్న యూవత ను విధంగా మాట్లాడటం ఇంతవరకు సమన్వయ మని అన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపత్ స్కీమ్ ను వెంటనే రద్దు చేయాలి ఆర్మీ రాత పూర్వక నిర్వహించలని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గజ్జల శ్రీకాంత్,జిల్లా ఉపాధ్యక్షులు కంపెళ్లి అరవింద్,తిప్పారపు రోహిత్,నాయకులు రత్నం సురేష్, శ్రీవని,అభినయ,ప్రవీణ్,సాయికిరణ్,అనిల్ తదితరులు పాల్గొన్నారు