కార్పొరేట్ ప్రైవేట్ ఆస్పత్రుల లో ఫిజుల నియంత్రణ చట్టం చేయాలి

ఎఐవైఎఫ్ ప్రధాన కార్యదర్శి బ్రాహ్మణపల్లి యుగంధర్

0 7,549

జిల్లాలోని కార్పోరేట్ ప్రేవేట్ ఆసుపత్రులలో ఆధిక ఫీజులు వసూలు చేస్తున్న పలు ఆసుపత్రుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిలభారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజాఆరోగ్య శాఖ డైరేక్టర్ డాక్టర్ జి శ్రీనివాసరావు గారికి వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగింది
అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రాహ్మణపల్లి యుగంధర్ మాట్లాడుతూ కార్పోరేట్,ప్రైవేట్ ఆసుపత్రుల్లో రకరకాల పరీక్షలు ఆనవసర ఆపరేషన్లతో పేద మధ్య తరగతి ప్రజల నుండి అందినకాడికి డబ్బులు దండుకుంటున్నారని కార్పొరేట్ ప్రైవేట్ ఆస్పత్రుల యజమాన్యాలు గబ్బర్ సింగ్ సినిమా తరహాలో ” మాకు కొంచెం తిక్కుంది మేము వసూలుచేసే డబ్బులకు ఏ లెక్క లేదు” అన్న చందంగా రోగుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వైద్యా ఖర్చులతో పేద మధ్యతరగతి ప్రజలు ఆస్తులు,తాళిబోట్టు సైతం ఆమ్ముకుంటున్నారని ప్రతి యేటా కార్పొరేట్,ప్రైవేట్ ఆసుపత్రులు 4.7కోట్ల మంది ప్రజలను పేదరికంలోకీ నేడుతున్నాయన్నారు అల్లోపతి వైద్యావిదానంలోMBBS చేసిన వారే వైద్యం చేయాలని నిబందనలు ఉన్నప్పటికీ కార్పోరేట్,ప్రైవేట్ ఆసుపత్రుల్లో BAMS, BHMS DEGREE లు చేసిన వారే వైద్యం చేస్తున్నారని ఆరోపించారు X-ray లో 30శాతం, MRI-CT SCAN లో 33శాతం ఆదనంగా డబ్బులు దండుకుంటున్నారని మండిపడ్డారు నిబందనల ప్రకారం రోగులకు అన్ని పరీక్షలు అవసరం లేదాని జాతీయ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేబూతున్న ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రత్యేక ప్యాకేజీల పేరుతో రోగులను భయ భ్రంతులకు గురిచేస్తున్నారని వైద్యులను అదుపు చేయాల్సినటువంటి జాతీయ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆవినీతిమయమైందని కార్పోరేట్,ప్రైవేట్ ఆసుపత్రులిచ్చే కాసులకు కక్కుర్తి పడి కంచే చేను మేసింది అన్నచందంగ వ్యవహరిస్తుందన్నారు కేంద్ర,రాష్ర్టప్రభుత్వాలు చట్టాలయితే చేశాయి కానీ చట్టం అమలుచేయటానికి కావల్సిన యంత్రంగం ఉందో లేదో ? కెసిఆర్,మోడీ చెప్పాలన్నారు మన ప్రభుత్వాలు జీడిపి పేరుగుదలే లక్ష్యంగా చేసుకోని ప్రజాఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని “ఆరోగ్యమే నిజమైన సంపద బంగారు వేండి నాణాలు కావు” అని మహత్మగాంధీ నాడే చేప్పారని గుర్తు చేశారు
పాలక వర్గాలు సైతం కార్పొరేట్ ప్రైవేట్ ఆస్పత్రులలో జరిగే అవినీతి మాఫియాను అరికట్టడంలో విఫలమయ్యారని రోగం ఒకటైతే మందు మరోటి ఇచ్చి ప్రజలను ఆర్థికంగా మానసికంగా కుంగదిస్తున్నారన్నారు కార్పొరేట్ ప్రైవేట్ ఆస్పత్రులకు స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విచ్చలవిడిగా అనుమతులిచ్చి వాళ్ల దగ్గర నుండి డబ్బులు దండుకుని అనుమతులు ఇస్తున్నారన్నారు జిల్లాలో 70 శాతం పైగా ఆస్పత్రుల లో సరైన వసతులు లేవని నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆసుపత్రులపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి ఏనాడు తనిఖీలు చేసిన సందర్భం లేదన్నారు ఆసుపత్రులపై యజమాయిషీ లేకపోవడం మూలంగా వారి దోపిడీకి అంతులేకుండా పోయిందని తమ సంఘం ఆనారోగ్య రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అని అన్నారు తమ సంఘం కార్పొరేట్ ప్రైవేట్ ఆస్పత్రులలో జరిగే అవినీతి అక్రమాలపై నిరంతరం క్షేత్రస్థాయిలో పోరాటాలు నిర్వహిస్తుందని నిరంతరం పేద మధ్యతరగతి ప్రజల పక్షాన నిరంతరం పోరాటాలు నిర్వహిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో లో బూడిద కుమార్ రంజిత్ సురేందర్ మహేశ్ తదితరులు పాల్గొన్నారు

Also Read :

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents