కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం పై ఉద్యమించాలి.

---- టియుసిసి జాతీయ కార్యదర్శి బండ సురేందర్ రెడ్డి డిమాండ్.

0 7,485

కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం పై ఉద్యమించాలి.
ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే కార్మికులకు కనీస వేతనాలు 24వేలు ఇవ్వాలి.
—- టియుసిసి జాతీయ కార్యదర్శి బండ సురేందర్ రెడ్డి డిమాండ్.

ఈ రోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కార్మికుల సమావేశం బండారి శేఖర్ అధ్యక్షతన జరిగినది. ఈ సభకు టియుసిసి జాతీయ కార్యదర్శి బండ సురేదర్ రెడ్డి గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులు 80 మంది శానిటేషన్, పెసెంట్ కేర్ కార్మికులు బాండ సురేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో టియుసిసి లో జాయిన్ అవ్వడం జరిగింది. వారిని ట్రేడ్ యూనియన్ కోఆర్డినేషన్ సెంటర్ టియుసిసి లోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం జరిగిన సమావేశంలో బండ సురేందరెడ్డి గారు మాట్లాడుతూ కేంద్ర బిజిపి ప్రభుత్వం కార్మిక చట్టాలను కార్పెరేట్లకు అనుకూలంగా మార్చుతున్నదని విమర్శించారు. కార్మికుల హక్కులను కలరాస్తుందని విమర్శించారు. కార్మికులు 8గంటల పనిచేసువిధానాన్ని 12గంటలకు పెంచడాన్ని తీవ్రంగా ఖండించారు. చేశారు. కేంద్రం ప్రభుత్వం కార్మికులను కార్పెరేట్లకు బానిసలుగా మార్చే కార్మిక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పనిచేస్తున్న కార్మికుల జీతాలు గొర్రెతోక లెక్క జీతాలు పెంచడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. కరోన కష్టకాలంలో అహర్నిశలు పని చేసిన ఆసుపత్రి కార్మికులకు జీతాలు పెంచక పోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. రూ౹౹ 7500/-ల నుండి రూ౹౹ 8వేల రూపాయలతో ఒక్క కుటుంబం ఎలా గడుస్తుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కార్మికులకు కనీస వేతనం 24వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భవిష్యత్ లో ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే కార్మికులను కక్ష సాధింపతో వేధింపులకు గురిచేస్తే చూస్తూరుకోమని హెచ్చరించారు. కార్మికులు సంఘం పెట్టుకొని హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గవ్వ వంశీధర్ రెడ్డి, టియుసిసి జిల్లా కన్వీనర్ కురువెళ్లి శంకర్, అగ్రగామి మహిళా సమితి జిల్లా కన్వీనర్ ఐల ప్రసన్న, కార్మికులు 80 మంది పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents