ఏ ఐ ఎస్ బి 72వ వార్షికోత్సవాలను జయప్రదం చేయండి
ఏఐఎస్ బీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గవ్వ వంశీధర్ రెడ్డి.
అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఏ.ఐ ఎస్ బి వార్షికోత్సవాలను పురస్కరించుకొని కరీంనగర్ లోని ఏఐఎఫ్ బీ పార్టీ కార్యాలయంలో ఏ ఐ ఎస్ బి రాష్ట్ర కార్యదర్శి మొలుగూరి హరికృష్ణ ఆధ్వర్యంలో వార్షికోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గవ్వ వంశీధర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఏ ఐ ఎస్ బి 1951 జూన్ 25 వ తేదీన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఏర్పడి నాటి నుంచి నేటి వరకు దేశవ్యాప్తంగా సోషలిజం ,పీస్ ,ప్రోగ్రెస్ అనే నినాదాలతో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి ఆశయాల సాధనకై ఉద్యమాలు నిర్వహిస్తుందని తెలిపారు.. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం మత విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసిందన్నారు. అదే విధంగా అగ్నిపత్ కొత్త పాలసీ ని తీసుకువచ్చి దేశానికి సేవ చేయాలనే నిజాయితీగల యువకులకు ఆర్మీ లో చేరకుండా అడ్డు పడిందని పేర్కొన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపత్ అనే పాలసీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాల్పుల్లో మరణించిన దామెర రాకేష్ కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వ విద్యా రంగాన్ని నిర్వీర్యం చేస్తోందన్నారు. విద్యావ్యస్థపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు చిత్తశుద్ది లేదన్నారు. బాసర త్రిబుల్ ఐటీకి చెందిన 9 వేల మంది విద్యార్థులు రోడ్డక్కి ఆందోళనలు చేస్తున్నా కనీసం పట్టించుకోకుండా దేశ రాజకీయాలంటూ స్వలాభం చూసుకోవడం సిగ్గు చేటన్నారు . పోలీసులతో ఉద్యమాలను అణచివేయాలనుకోవడం అవివేకమన్నారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు సమస్యలను పరిష్కరించకుండా ప్రైవేటు యూనివర్సిటీలకు రెడ్ కార్పెట్ తో స్వాగతం పలుకుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా వ్యాపారీకరణను విద్యార్థులంతా ఏకమై వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. తక్షణమే ప్రభుత్వ విద్యా సంస్థల్లో సరైన మౌలిక వసతులు కల్పిస్తూ ప్రభుత్వ విద్య సంస్థలలో ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయాలని, పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్ మెంట్ తక్షణం విడుదల చేయాలని ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుందన్నారు. జూన్ 25 న జరగబోయే ఏ ఐ ఎస్ బి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ( ఏఐఎస్ బీ ) పార్టీ జిల్లా నాయకులు ఉప్పులేటి రాజు, సాయితేజ , కార్తీక్ రెడ్డి, హరీష్, ఏఐఎఫ్ బీ జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు శంకర్ కురువెల్లి తదీతరులు పాల్గొన్నారు.