బిజెపి ఆఘనంగా ” యోగా దివస్” వేడుకలు..

బిజెపి ఈస్ట్ జోన్ యోగా దివస్ వేడుకల్లో జిల్లా అధ్యక్షుడు గంగా డి కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి

0 6,246

*మానవాళికి సనాతన ధర్మం ఇచ్చిన గొప్ప బహుమతి “యోగ”

*యోగకు అంతర్జాతీయ ఖ్యాతి ,గుర్తింపు బిజెపి మోడీ ప్రభుత్వ కృషి ఫలితమే..

బిజెపి ఈస్ట్ జోన్ యోగా దివస్ వేడుకల్లో జిల్లా అధ్యక్షుడు గంగా డి కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి ..

అంతర్జాతీయ యోగా దినోత్సవం 21 పురస్కరించుకొని
భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా స్వాస్త్ భారత్ …శ్రేష్ట్ భారత్ నినాదంతో చేపడుతున్న “యోగా దివస్” కార్యక్రమంలో భాగంగా మంగళవారం కరీంనగర్ జిల్లాలోని అన్ని బిజెపి శక్తి కేంద్రాల్లో ఘనంగా యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు అందరూ ప్రజలందరి భాగస్వామ్యంతో యోగా దివస్ వేడుకలను అంగరంగ వైభవంగా చేపట్టారు . కరీంనగర్ పట్టణం లోని కాపు వాడ హై స్కూల్ లో బిజెపి ఆధ్వర్యంలో జరిగిన యోగా దివస్ వేడుకల్లో జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి పాల్గొని , యోగ శాస్త్రం గురించి మాట్లాడారు. మానవాళికి సనాతన ధర్మం ఇచ్చిన గొప్ప బహుమతి “యోగ “అని,మానవుని ఆరోగ్యకర జీవితానికి యోగ సాధన కు మించిన దివ్యౌషధం ఏదీ లేదని ,
ప్రపంచ దేశాల్లో యోగాకు ఖ్యాతి , అంతర్జాతీయ గుర్తింపు బిజెపి మోడీ ప్రభుత్వం కృషి ఫలితమేనన్నారు. దాదాపు 5 వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాచీన యోగ శాస్త్రానికి ప్రాచుర్యం కల్పించే విధంగా కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని వివరించారు . భారతదేశానికి యోగా పుట్టినిల్లు లాంటిదని, అలాంటి యోగ విశిష్టత ,ప్రాముఖ్యత ప్రపంచ దేశాలకు తెలియజేసేలా మోడీ ప్రభుత్వం విశేష కృషి చేసిందన్నారు. యోగ ప్రాముఖ్యతను గుర్తించిన ఐక్యరాజ్యసమితి జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని నిర్వహించడం దేశానికి గర్వ కారణమన్నారు . ముఖ్యంగా
అర్థవంతమైన జీవనానికి ,సామాజిక ఆరోగ్యానికి యోగా సాధన అవసరమన్నారు. ప్రతి ఒక్కరినిత్య జీవితంలో యోగ ఒక భాగం కావాలన్నారు. ఎందరో యోగా గురువులు, మహర్షులు మనకు అందించిన గొప్పయోగ శాస్త్రం నేడు యావత్ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచిందన్నారు . మనిషి శరీరానికి మెదడు కి మధ్య ఏకత్వాన్ని , సంయోగాన్ని కుదిర్చే సునిశితమైన శాస్త్రమే యోగ అని చెప్పారు . ఏకాగ్రత పెరిగే కొద్దీ ఎక్కువ జ్ఞానాన్ని ఆర్జించ వచ్చని అది కేవలం యోగా తోనే సాధ్యమవుతుందన్నారు. శరీరం, మెదడు, ఆత్మలన్నింటిని వృద్ధి చేయడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. క్రమం తప్పకుండా యోగా సాధన చేసే వారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని దీంతో జీవితం కూడా ఆనందంగా, ఆరోగ్యకరం గా ఉంటుందన్నారు. యోగ శాస్త్రం అనాదిగా కొన్ని వేల సంవత్సరాలుగా మనదేశంలో ఉందని, మన పూర్వీకులు యోగ సాధనతోనే ఆరోగ్యంగా జీవించారని తెలిపారు. నిత్య జీవితంలో చేసేఅత్యుత్తమవ్యాయామాల్లో యోగ దే ప్రథమస్థానం అన్నారు. అలాంటి యోగాశాస్త్రాన్ని ప్రతి ఒక్కరూ అభ్యసించాలని, యోగ విధానాలు పాటించి, ఆరోగ్యకరమైన జీవితం గడపాలని ఆయన సూచించారు. ఏకాగ్రత జ్ఞాన సముపార్జనకు ఏకైక మార్గం యోగా సాధనే అని చెప్పారు. తనువు, మనసు, ఆత్మను ఏకం చేసే సాధనే యోగ అని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్లెం వాసుదేవ రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్, కరీంనగర్ అసెంబ్లీ కన్వీనర్ దుబ్బలశ్రీనివాస్ ,ఈస్ట్ జోన్ అధ్యక్షులు అవ దుర్తి శ్రీనివాస్, ఉమామహేశ్వర్, లక్కాకుల మునిందర్, పో రెడ్డి శ్రీధర్, తోట సాగర్, నవీన్, నరేందర్లతోపాటు ఈస్ట్ జోన్ బాధ్యులు , శక్తి కేంద్ర ఇంచార్జిలు , బూత్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents