దళితబంధు తో దళితులు చాలా సంతోషం

జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ

0 8,453

పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ అన్నారు.బుధవారం నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. వ్యవసాయం, ఉద్యానవనం, మార్కెటింగ్, మత్స్యశాఖ, గ్రామీణ అభివృద్ధి, విద్య, వైద్య శాఖ, జిల్లా పంచాయతీ శాఖల ప్రగతి పై శాఖల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు హుజూరాబాద్ నియోజకవర్గం లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న దళితబంధు పథకంతో దళితులు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. వైకుంఠధమాల వద్ద బోర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ను కోరారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నూతనంగా ఏర్పాటుచేసిన మైక్ సెట్ ను ఆమె ప్రారంభించారు.జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ మాట్లాడుతూ ఈ నెల 3 నుండి 18 వరకు నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేసినందుకు కలెక్టర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలన్నీ పరిశుభ్రంగా మారడంతో డెంగ్యూ విష జ్వరాలు తగ్గాయన్నారు. ఆశ ,అంగన్వాడి, స్వశక్తి సంఘాలు , ఎంపీపీ ఎంపిటిసి లు మెడికల్ కమిటీ సమావేశం నిర్వహించి వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామ మండల జిల్లా స్థాయిలో నియంత్రణ చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్ మళ్లీ రాకుండా ప్రికాషన్స్ డోస్ వేయించాలన్నారు. వ్యాక్సినేషన్ లో రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. జిల్లాలో గర్భిణీలు సాధారణ ప్రసవాలు చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. సమాజంలో మార్పు తీసుక వచ్చేందుకు ప్రజాప్రతినిధుల తమ సహకారం అందించాలన్నారు. గతంలో ఎక్కడా లేనివిధంగా హుజరాబాద్ నియోజవర్గంలో దళిత బంధు పథకమును పైలెట్ ప్రాజెక్టుగా గత ఆగస్టులో ప్రారంభించి 13559 మంది లబ్ధిదారులను గుర్తించి ఇప్పటివరకు 10006 యూనిట్లను గ్రౌండింగ్ చేయడం జరిగిందన్నారు. మిగితా యూనిట్లను త్వరిత గతిన పూర్తి చేయనున్నామని తెలిపారు. కరీంనగర్ నియోజకవర్గంలో 202 యూనిట్లను గ్రౌండింగ్ చేయడం జరిగిందని మిగతా ఏడు యూనిట్లను వారంలోగా బ్రాండింగ్ చేయనున్నట్లు తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents