నేడే చివరి రోజు

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

0 3

తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామం అంగారక టౌన్ షిప్ (రాజీవ్ సుగృహ ) మొదటి విడత ప్లాట్ల ప్రత్యక్ష వేలానికి నేడు శుక్రవారం చివరి రోజని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు.
మొదటి విడత 237 ఫ్లాట్ల కు జూన్ 20 నుండి 24 వరకు ప్రత్యక్ష వేలంపాటల్లో జూన్ 23 వరకు 200 ప్లాట్లను వేలం వేయడం జరిగిందని, ప్రత్యక్ష వేలం పాటల్లో చివరి రోజైన నేడు జూన్ 24 న చివరి 37 ప్లాట్లకు వేలం వేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రత్యక్ష వేలం పాటలను వాసర ఫంక్షన్ హాల్ లో నేడు జూన్ 24న ఉదయం10.30 గంటల నుండి మధ్యాహ్నం2.00 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ వేలం పాటల్లో దరఖాస్తుదారులతోపాటు గతంలో దరఖాస్తు చేసుకున్న రాజీవ్ స్వగృహ దరఖాస్తుదారులు కూడా పాల్గొన వచ్చని కలెక్టర్ తెలిపారు. ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents