దళిత బందుతో ఆర్థికాభివృద్ధి సాధించాలి
రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్..
దళితుల ఆర్థిక అభివృద్ధి ధ్యేయంగా ప్రవేశపెట్టిన దళిత బందును సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.గురువారం జమ్మికుంట పట్టణంలో దళిత బంధు పథకం కింద మంజూరైన మెడికల్ ల్యాబ్, కంప్యూటర్ హార్డ్వేర్, టీ స్టాల్, శ్రీ సాయిరాం యూనిట్లను రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్పర్సన్ బండ శ్రీనివాస్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల ఆర్థికాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకం ప్రవేశ పెట్టిందని ఈ పథకం సద్వినియోగం చేసుకొని పదిమందికి ఉపాధి కల్పించేలా ఎదగాలి అన్నారు.ఈ కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు, జడ్పిటిసి శ్రీ రామ్ శ్యామ్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పొనగంటి సంపత్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య ఎంపీడీవో కల్పన, టిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి నెగెల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు