స్పోర్ట్స్ సిటీగా కరీంనగరం

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

0 3

చారిత్రక ప్రాశస్త్యం కలిగి క్రీడారంగంలో విశేష ఖ్యాతిని పొందిన కరీంనగర్ ఓవైపు స్మార్ట్ సిటీ గా అభివృద్ధి చెందుతూనే స్పోర్ట్స్ సిటీగా రూపొందుతుందని జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ అన్నారు.
కరీంనగర్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్, క్రీడా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం కరీంనగర్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టేడియంలో జరిగిన ఒలింపిక్ డే రన్ ప్రారంభ కార్యక్రమానికి అయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా మౌళిక సదుపాయాలు ఏర్పాటులో భాగంగా సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ తొందరలోనే క్రీడాకారులకు అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు. అంబేద్కర్ స్టేడియంలోని ఇండోర్ లో బ్యాడ్మింటన్ కోర్టు , జిమ్నాసియం తోపాటు పలు క్రీడలకు సంబంధించి శిక్షణ సదుపాయాలు స్మార్ట్ సిటీ తో మెరుగయ్యాయని తెలిపారు. క్రీడలను నిత్యజీవితంలో భాగంగా చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
అనంతరం కలెక్టర్ ఒలింపిక్ జ్యోతిని వెలిగించి ఒలింపిక్ డే రన్ లాంఛనంగా ప్రారంభించారు. అంబేద్కర్ స్టేడియం నుండి తెలంగాణ చౌక్ మీదుగా తిరిగి స్టేడియం వరకు ఈ రన్ కొనసాగింది. దాదాపు వేయి మంది పాల్గొన్నరు. కలెక్టర్ ఒలింపిక్ జ్యోతిని చేతబూని రన్ లో పాల్గొన్నారు.
నగర మేయర్ వై.సునీల్ రావు మాట్లాడుతూ కరీంనగర్ ను అన్ని రంగాలతో పాటు క్రీడారంగం అభివృద్ధి చేయాలనే సంకల్పంతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి డివిజన్ లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుతో పాటు నగరవాసులకు అందుబాటులో ఓపెన్ జిమ్ లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. స్మార్ట్ సిటీ లో భాగంగా క్రీడా రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించినట్లు చెప్పారు.
జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నందెల్లి మహిపాల్, గసిరెడ్డి జనార్దన్ రెడ్డిలు మాట్లాడుతూ ఒలింపిక్ స్పూర్తి ని భవిష్యత్తరాలకు అందించాలనే సంకల్పంతో ఒలింపిక్ డే రన్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అధికారులు ప్రజాప్రతినిధుల సహకారంతో క్రీడారంగంలో కరీంనగర్ విశేష అభివృద్ధి సాధిస్తున్నట్లు చెప్పారు. .
ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడలు యువజన శాఖాధికారి కె. రాజవీరు, ఏసీపీలు తుల శ్రీనివాసరావు,విజయ్ కుమార్, సీఐ నటేశన్, రాష్ట్ర బేస్ బాల్ సంఘం అధ్యక్షులు చల్ల హరిశంకర్,ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు తుమ్మల రమేష్ రెడ్డి, సీఎ నిరంజనాచారి, డాక్టర్ రమణాచారి, కోశాధికారి ఎన్.సిద్ధారెడ్డి, ఎస్జీఎఫ్ కార్యదర్శి కె.సమ్మయ్య, అంతర్జాతీయ పారా అథ్లెట్ అంజనా రెడ్డి, వివిధ క్రీడా సంఘాల బాద్యులు ఎస్.సారయ్య, ఎ.శంకరయ్య, కడారి రవి,జి. విజయభాస్కర్ రెడ్డి, బాబు శ్రీనివాస్, జె.ఆనందం, లక్ష్మణ్, ప్రభాకర్ , రాజ్ గోపాల్, గిన్నె లక్ష్మణ్, యూనస్ పాషా, వలీపాషా, పిఈటిలు శ్రీలక్ష్మి, శ్రీలత, హరికిషన్, రమేష్, శ్రీనివాస్, జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయుల తోపాటు అయాన్, శాతవాహన సంస్థల శిక్షణార్థులు, వాకర్స్, క్రీడాకారులు పాల్గొన్నారు.

 

Also Read :

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents