జాతీయవాద నాయకులు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ.
బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణ రెడ్డి
భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్ సందర్భంగా జమ్మికుంట లో నివాళులు అర్పించిన బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి.
దేశ సమైక్యత కోసం ప్రాణాలర్పించిన మహా నేత డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ అని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి గారు అన్నారు. జమ్మికుంట పట్టణంలో డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి అంజలి ఘటించి నివాళులు అర్పించిన కృష్ణా రెడ్డి గారు మాట్లాడుతూ..
ఏక్ దేశ్ మే దో నిశాన్, దో ప్రధాన్, దో విధాన్ నహీ చెలేగా.. నహీ చెలేగా.. అనే నినాదంతో కాశ్మీర్ కూడా భారత్లో అంతర్భాగమేనని పోరాటం చేసిన యోధుడు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ అని అన్నారు. బ్రిటిష్ వారు భారత దేశాన్ని చీల్చి పాకిస్తాన్ ఏర్పాటు చేస్తే, పాకిస్తాన్ పుట్టక ముందే దాన్ని చీల్చిన ఘనత ఆయనది.. దేశంలో జాతీయవాద రాజకీయానికి ఆ మహనీయుని అంకురార్పన ఇవాళ బీజేపీ రూపంలో మహావృక్షంగా విస్తరించడం ఈనాడు మనం ప్రత్యక్షంగా చేస్తున్నాం.. ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూకాశ్మీర్ ను దేశంలో సమైక్య భాగంగా గుర్తించాలంటూ ఉద్యమించిన మహానేత ఆయన.. ఆయన ఆశయాలను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు, పట్టణ అధ్యక్షులు జి డి మల్లేష్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్,బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు కోరే రవీందర్, ఎస్టి మోర్చా ప్రధాన కార్యదర్శి తిరుపతి శ్రీనివాస్ దొంతుల రాజ్ కుమార్ పల్లపు రవి, ఇటుకల స్వరూపా, ఎదులాపురం అశోక్, మోతే స్వామి, కోలకని రాజు, అప్ప మధు, మోడె0 రాజు తదితరులు పాల్గొన్నారు.