సమాజంలో జర్నలిస్టల పాత్ర కీలకం
ఏఐఎఫ్ బీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి
సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి అన్నారు. శుక్రవారం కరీంనగర్ లో జరిగిన ప్రజా జ్యోతి దినపత్రిక ఉమ్మడి జిల్లా రిపోర్టర్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజాజ్యోతి దిన పత్రిక వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తూ సమాజంలో మంచి పేరు సాధించిందని కొనియాడారు. సమాజంలో ఏ రంగంలోనైనా చెదలు పడితే దుమ్ము దులుపేది జర్నలిస్టులు మాత్రమేనన్నారు. అవినీతి నిర్మూలనలో పెన్ను పవర్ చాలా గొప్పదని కొనియాడారు. జర్నలిస్టులు సమాజానికి ఆదర్శనీయులన్నారు. సీనియర్ జర్నలిస్టు ఎర్రోజు శ్రీనివాస్ మాట్లాడుతూ పత్రికా రంగం డిజిటల్ రంగంలో దూసుకెళుతోందని, జర్నలిస్టులు అప్ డేట్ కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ప్రజాజ్యోతి ఇంచార్జి ఎండీ రఫీ, బ్యూరో ఇంచార్జి సదానందం , ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రిపోర్టర్లు పాల్గొన్నారు.