Print Friendly, PDF & Email

వివిధ రకాల కేసుల్లో శిక్షలు పడే శాతాన్ని పెంచాలి

రాష్ట్ర డిజిపి యం మహేందర్ రెడ్డి

రాష్ట్ర డిజీపీ యం మహేందర్ రెడ్డి శనివారం నాడు జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్ల తో పెండింగ్ కేసులు, ఫంక్షనల్ వర్టికల్ గురించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.పోక్సో మరియు మహిళలకు సంబంధించిన ఇతర కేసుల్లో నిందితులకు శిక్షలు పడే శాతాన్ని పెంపొందించడంతో పాటు ప్రతి కేసు దర్యాప్తులో నాణ్యత ప్రమాణాలు కలిగిఉండాలన్నారు.డీజీపీ ఆఫీస్ లో ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ సెంటర్ ను ప్రారంభించడం జరిగింది, ప్రతి జిల్లాలో ఉన్న పోలీస్ అధికారులు కేసుల దర్యాప్తులో ఏమైనా సమస్యలు ఉంటే సదరు అధికారుల దృష్టికి తీసుకవచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు

ఈ సెంటర్లో పోలీస్ అధికారులు 24×7 అందుబాటులో ఉంటారని తెలిపారు. సిసిటిఎన్ఎస్ వర్షన్ 2.0 అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి జిల్లాలో ఉన్న పోలీస్ అధికారులకు సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. కేసుల్లో శిక్షల శాతం పెంచడానికి పోలీస్ అధికారులు సిబ్బంది తరచుగా మెజిస్ట్రేట్లను, జడ్జిలను కలవాలని సూచించారు. గ్రేవ్, పోక్సో మరియు మహిళలకు సంబంధించిన కేసుల్లో కేసు ట్రయల్ సమయంలో సాక్షులను పిలిపించుకొని సాక్ష్యం చెప్పే విధంగా మోటివేట్ చేయాలని సూచించారు. కేసుల్లో నేరస్తులకు శిక్ష పడితే క్రైమ్ రేట్ తగ్గుతుందని తెలిపారు కేసుల్లో నేరస్తులకు శిక్షలు పడేటట్లు అన్ని కోణాలలో కేసుల పరిశోధన ఉండాలని సూచించారు వివిధ రకాల కేసులలో శిక్షల శాతాన్ని పెంచడం ద్వారా ప్రజలలో డిపార్ట్మెంట్కు మంచి పేరు వస్తుందని మరియు నేరాలు తగ్గుముఖం పడతాయన్నారు.ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పెండింగ్ ఉన్న కేసులలో సంబంధిత అధికారులు ప్రతిరోజు ఎఫ్ఎస్ఎల్ అధికారులతో మాట్లాడి త్వరగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.గ్రేవ్, ఎస్సీ,ఎస్టీ క్రైమ్ ఎగైనెస్ట్ ఉమెన్, పోక్సో, కేసుల్లో నేరస్తులకు శిక్షలు పడే విధంగా ఇన్వెస్టిగేషన్ ఉండాలని కోర్టు ట్రాయల్ సమయంలో సాక్షులను మోటివేట్ చేయాలి సూచించారు. కేసులలో ఎఫ్ఎస్ఎల్ కు సంబంధించిన కేసు ప్రాపర్టీని ఎలాంటి జాప్యం లేకుండా త్వరగా ఎఫ్ఎస్ఎల్ లో డిపాజిట్ చేయాలని సూచించారు. ఎస్సీ,ఎస్టీ పోక్సో, క్రైమ్ ఎగైనెస్ట్ ఉమెన్, కేసుల్లో సంబంధిత బాధితులకు త్వరగా నష్టపరహారం వచ్చే విధంగా అన్ని డిపార్ట్మెంట్ అధికారులతో ప్రతిరోజు మానిటర్ చేయాలని సూచించారు.డిపార్ట్మెంట్కు సంబంధించిన (ఓఈ) ఓరల్ ఎంక్వయిరీ లను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. గంజాయి ట్రాన్స్ పోర్ట్, మరియు అమ్మే వ్యక్తులపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి కేసులు నమోదు చేసి సమూలంగా నిర్మూలించాలని సూచించారు. ఫంక్షనల్ వర్టికల్ వారిగా విధులు నిర్వహించిన ప్రజలకు ఉత్తమ సేవలు అందించిన పోలీస్ అధికారులకు సిబ్బందికి రివార్డులు అవార్డులు అందజేస్తామని తెలిపారు.హెచ్ఆర్ఎంఎస్ మాడ్యుల్ లో వున్న అన్ని అంశాలను పోలీస్ అధికారులు సిబ్బంది వినియోగించుకోవాలని సూచించారు. సైబర్ నేరాలపై నిఘా పెంచాలన్నారు.వీడియో కాన్ఫరెన్స్ లో పోలీస్ కమీషనర్ వి సత్యనారాయణ, అడిషనల్ డిసిపిలు ఏస్ శ్రీనివాస్(ఎల్&ఓ), జి చంద్రమోహన్(పరిపాలన), ఏసిపిలు తుల శ్రీనివాస రావు, కాశయ్య, సత్యనారాయణ, విజయ్ కుమార్, సి ప్రతాప్, ఎస్బిఐ జి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents