డంపింగ్ యార్డ్ ను సందర్శించిన మేయర్ సునీల్ రావు, కమిషనర్ సేవా ఇస్లావత్.
ప్రతిరోజు రెండు వేల మెట్రిక్ టన్నుల ప్రక్షాళన చేయాలని ఏజెన్సీ కి సూచన.
ఉత్పత్తి అయ్యే చెత్తను RRR కాన్సెప్ట్ అనుసరించి రెడ్యూస్, రీసైక్లింగ్, రీయూజ్ చేయాలని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్లో నగరపాలక సంస్థ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఈ ప్రక్రియలో భాగంగా శనివారం రోజు మేయర్ యాదగిరి సునీల్ రావు, కమిషనర్ సేవ ఇస్లావత్, 9 వ డివిజన్ పరిధిలోని డంపింగ్ యార్డ్ ను సందర్శించారు. స్థానిక కార్పొరేటర్ ఐలేందర్ యాదవ్, నగరపాలక సంస్థ మరియు ఆర్వి కన్సల్టెన్సీ అధికారులతో కలిసి బయోమైనింగ్ ప్రక్రియను తనిఖీ చేసి పరిశీలించారు. ప్రక్రియ ప్రారంభం నుండి ఇప్పటి వరకు జరిగిన బయో మైనింగ్ ప్రాసెస్ పనితీరును పరిశీలించి సంబంధిత ఏజెన్సీ కాంట్రాక్టర్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బయో మైనింగ్ ప్రక్రియ వేగవంతం పై ఏజెన్సీ కాంట్రాక్టర్ ను ఆదేశించారు.
మరోవైపు ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన సివిల్ ఇంజనీర్ విద్యార్థులు ప్రాజెక్ట్ స్టడీ టూర్ లో భాగంగా డంప్ యార్డ్ ను విజిట్ చేశారు. డంపింగ్ యార్డ్ లో నగరపాలక సంస్థ ప్రారంభించిన బయో మైనింగ్ ప్రక్రియను స్టడీ చేశారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రక్రియలో భాగంగా చెత్తను వేరు చేయకపోవడం వల్ల కలిగే సమస్యలు, సెక్రిగేషన్ ప్రక్రియ విధానం, వ్యర్థాల సేకరణ, బయో మైనింగ్ ప్రక్రియ విధానం తదితర అంశాలపై కళాశాల విద్యార్థులు ప్రాజెక్ట్ స్టడీ చేశారు. ఈ నేపథ్యంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు విద్యార్థినీ విద్యార్థులను ప్రాజెక్ట్ సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కళాశాల విద్యార్థులకు నగరపాలక సంస్థ లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రక్రియ, డంపింగ్ యార్డ్ లో చేపట్టే బయో మైనింగ్ ప్రాసెస్ పై అవగాహన కల్పిస్తూ వ్యర్థాల ద్వారా కలిగే నష్టాలు, చెత్తను వేరు చేయడంలో ప్రయోజనాలను RRR విధానం పై విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులకు మేయర్ సునీల్ రావు, కమిషనర్ సేవ ఇస్లావత్ ప్రాజెక్ట్ స్టడీ టూర్ సర్టిఫికెట్స్ అందించారు. ఈ సందర్భంగా గా మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ… కరీంనగర్ నగరం లో గత 40 ఏళ్లుగా గుట్టలుగా పేరుకుపోయిన డంపింగ్ లో ఉన్న చెత్తను నిర్మూలించే ప్రక్రియను ప్రారంభించామన్నారు. నగర ప్రజలకు చాలా కాలంగా గా డంపింగ్ యార్డ్ వాతావరణాన్ని కలుషితం చేస్తున్న దృశ్యం శాశ్వతంగా తొలగించేందుకు నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ బయో మైనింగ్ ఈ ప్రక్రియను చేపట్టిందని విద్యార్థులకు తెలిపారు. ఉత్పత్తి అయ్యే చెత్తను సగం వరకు డంపింగ్ యార్డుకు రాకుండానే ప్రాసెస్ చేయవచ్చని తెలిపారు. ప్రతిరోజు ఉత్పత్తయ్యే చెత్తను తడి పొడిగా వేరు చేయాలని తెలిపారు. తడి చెత్త నుండి వర్మి కంపోస్ట్ ఎరువు ను తయారు చేసుకోవడం త పాటు… పొడి చెత్త లో లభ్యమయ్యే వాటిని రీసైక్లింగ్ ప్రక్రియకు పంపించవచ్చు అన్నారు. ప్రతి ఇంట్లో ఇలా చెత్తను వేరు చేయడం ద్వారా డంపింగ్ లో చెత్త పేరుకుపోదన్నారు. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ మన ఇంట్లోనే చెత్తను వేరు చేసి అందిస్తేనే డంపింగ్ యార్డ్ లేకుండా నిర్మూలించవచ్చు అన్నారు. చెత్తను వేరు చేయకపోవడం వల్ల కలిగే నష్టాలను వచ్చే సమస్యలను విద్యార్థులు మీ మీ ప్రాంతాల ప్రజలకు అవగాహన పరచాలని కోరారు. ప్రజలకు ప్రాణహాని గా మారిన నగరపాలక సంస్థ డంపింగ్ యార్డ్ 16 కోట్ల రూపాయలతో బయో మైనింగ్ ప్రక్రియ ద్వారా నిర్వహిస్తున్నామన్నారు. గత నలభై ఏళ్ల నుండి రెండు లక్షల మెట్రిక్ టన్నుల చెత్త ఇక్కడ పేరుకుపోయింది అన్నారు. ఇలాంటి పరిస్థితులు భవిష్యత్లో రాకుండా ఉండాలంటే ఉత్పత్తి అయ్యే చెత్తను రెడ్యూజ్, రీసైక్లింగ్, రీ యూజ్ పద్ధతిని అనుసరించాలి అన్నారు. రెండు లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను బయో మైనింగ్ ద్వారా తొలగించి స్థలాన్ని మానేరు రివర్ ఫ్రంట్ కు ప్రయోగిస్తామన్నారు. నగర పాలక సంస్థలు ప్రస్తుత సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం మరో స్థలాన్ని కూడా గుర్తించామన్నారు. ప్రస్తుతం అక్కడికి వచ్చే చెత్తను ఎప్పటికప్పుడు బయో మైనింగ్ ప్రాసెస్ చేస్తూ తొలగించడం జరుగుతుందన్నారు. అంతే కాకుండా డంపింగ్ యార్డ్ బయో మైనింగ్ ప్రక్రియపై ఆర్ వి కన్సల్టెన్సీ అధికారులను, ఏజెన్సీ కాంట్రాక్టర్ ను ఆదేశించినట్లు తెలిపారు. ప్రస్తుతం బయో మైనింగ్ ఈ ప్రక్రియలో ఏర్పాటు చేసిన మిషనరీ ప్లాంట్ లాంటి మరో ప్లాంటును త్వరలోనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిర్దేశించిన గడువులోగా బయో మైనింగ్ ప్రక్రియను పూర్తిచేసి చెత్తను నిర్మూలించాలని ఆదేశించారు. 2 బయో మైనింగ్ ప్లాంట్ల ద్వారా ప్రతిరోజు 2 వేల మెట్రిక్ టన్నుల చెత్తను ప్రాసెసింగ్ చేస్తూ తొలగించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరి శంకర్, కార్పొరేటర్ బండారి వేణు, ఈఈ కిష్టప్ప, కన్సల్టెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.