ఎస్.యుఎన్.ఐ.దాడి హేయమైన చర్య

విద్యార్థి ఫెడరేషన్ ఎస్ ఎఫ్ ఐ కరీంనగర్ జిల్లా కమిటీ

0 3

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ ఎఫ్ ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చిక్కడపల్లి లో ఉన్న రాష్ట్ర కార్యాలయంలో మీద దాడి కి వచ్చిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని నిరసిస్తూ మంకమ్మ తోట లో నిరసన చేయడం జరిగింది

ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ నాగరాజు మాట్లాడుతూ దేశంలోని రక్షిత అడవులు, నేషనల్ పార్కులు, వన్యప్రాణుల అభయారణ్యాల చుట్టూరా 1 కిలోమీటర్ మేర ఎటువంటి మానవ నివాస ప్రాంతాలు లేకుండా బఫర్ జోన్ ఏర్పాటు చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు జారీ చేసింది.3 విడతలుగా వారిని బఫర్ జోన్ల నుండి వెళ్ళగొట్టే కుట్రకు కేంద్రం తెరలేపింది.మొదటి విడతలో కోర్టు ఆదేశాల మేరకు కేరళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా అడవుల చుట్టూరా ఉన్న మానవ నివాస ప్రాంతాలను గుర్తించడం ప్రారంభించిన నేపథ్యంలో,అటవీ ప్రాంతాలకు అతి సమీపంలో ఉన్న ఆదివాసీ, గిరిజన ప్రజలు అటవీ ప్రాంతాలకు 1 కిలోమీటర్ మేర బఫర్ జోన్ ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగారు.ఈ విషయంపై వాయనాడ్ ఎంపీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు నిర్ణయంపై నోరుమెదపలేదు, కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేయలేదు. ప్రజారాశుల నిరసనలకు మద్దతుగా భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) స్థానిక వాయనాడ్ నియోజకవర్గ నాయకత్వం రాహుల్ గాంధీ కార్యాలయం ముందు ఆందోళనకు పిలుపునిచ్చింది.ఈ తరుణంలో కొందరు ఎస్ఎఫ్ఐ నాయకులు ఎం.పి.రాహుల్ గాంధీ ఆఫీస్ పై దాడి చేసారు.దీనిని అక్కడి ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.ఎస్ఎఫ్ఐ కేరళ రాష్ట్ర కమిటీ వీరిపై చర్యగా దాడికి పాల్పడిన వారిని ఎస్.ఎఫ్.ఐ.నుండి వారి బాధ్యతల నుండి సస్పెండ్ చేసింది.ఎం.పి. కార్యాలయం పై జరిగిన దాడిని ఎస్.ఎఫ్.ఐ.ఖండిస్తుంది. ఈ ఇది దురదృష్టకరం ఈ నేఫధ్యంలో ఇదే ఆదునుగా దేశంలో ఎస్.ఎఫ్.ఐ. కార్యలయాల పై దాడులు చేస్తుంది. ఎన్.ఎస్.యు.ఐ.ఇప్పటికే ఢిల్లీ ఆఫిస్ ,తెలంగాణ ఆఫీస్ లపై దాడులుకు తెగించింది. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు శుక్రవారం రాత్రి 8.48 నిమిషాలకు దాడికి దిగారు.టమాటాలు,కోడిగుడ్లు విసిరారు.కార్యలయంపై రాళ్ళు దాడికి ప్రయత్నించారు.ఎం.పి.కార్యాలయంపై దాడిని కేరళ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఖండించింది.దీనికి నాయకత్వం వహించిన వారిని సస్పెండ్ కూడా చేసింది.పత్రికలలో కూడా ప్రకటించింది.ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దానిని తీవ్రంగా ఖండించి బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు,వెంటనే రాష్ట్ర పోలీసు సిబ్బంది వారిని అరెస్టు చేసింది.ఇన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఎన్ఎస్ యూఐ దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ కార్యాలయాలపై దాడులు సరియైనది కాదని ఎస్ఎఫ్ఐ భావిస్తుంది.దేశంలో మతోన్మాద విధానాలు, నూతన విద్యావిధానం కు వ్యతిరేకంగా దేశంలో ఐక్య పోరాటాలు ఎస్.ఎఫ్.ఐ.బలపర్చుతుంది.దానికోసం ఇప్పుడు భవిష్యత్ లో ఐక్యకార్యాచరణ లో పని చేస్తుంది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఎస్.ఎఫ్.ఐ.డిమాండ్ చేస్తుంది. కానీ విద్యార్ది రంగ సమస్యలపై పోరాడాల్సిన సమయంలో ,విద్యార్ధి సంఘాల మద్య పరస్పర అభిప్రాయాలను కల్గి ప్రజాస్వామ్య వాతవరణం ఉండాల్సిన సమయం ఇలాంటి చర్యలు దుర్మార్గపు చర్య. తెలంగాణ రాష్ట్ర కార్యాలయంపై టమాటాలతో దాడులు‌‌,ఆఫీస్ పైకి రాళ్ళు రువ్వే ప్రయత్నం సరైనది కాదు.దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాము,ఎన్ ఎస్ యూఐ నేతలు విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వంతో కొట్లాడాలనీ, కాంగ్రెస్ బఫర్‌జోన్ల ఏర్పాటుతో నష్టపోతున్న లక్షలాది కుటుంబాల పక్షమా లేక‌ బిజేపీ ప్రభుత్వం వైపా తేల్చుకోవాలని హెచ్చరిస్తున్నాము. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షకార్యదర్శి లు గజ్జల శ్రీకాంత్, శనిగరపు రజినీకాంత్, గర్ల్స్ రాష్ట్ర కన్వీనర్ పూజ ,అభిలాశ్ వినిషా,నందిని, లావణ్య,మనోజ్, శివ ,రాకేష్ అభినయ,కార్తిక్,మౌనిక,నవీన్ తదితరులు పాల్గొన్నారు

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents