సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందచర్యలు చేపట్టాలికుండా పకడ్బందీ 

జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్

0 5

 

వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ అధికారులను ఆదేశించారు

కలెక్టరేట్ సమావేశ మందిరంలో హరిత హారం, సీజనల్ వ్యాధుల వ్యాప్తి, క్రీడా ప్రాంగణాలకు స్థలాలు గుర్తింపు, మొదలగు అంశాలపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని అధికారులను ఆదేశించారు. నాటిన మొక్కలు వంగిపోకుండా ఉండుటకు ఊతకర్రలు కట్టి ట్రీ గార్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. నర్సరీలలో నీరు నిల్వ ఉన్నట్లైతే చీడ పురుగులు వస్తాయని తద్వారా మొక్కలు చనిపోతాయని నర్సరీలలో నీరు నిల్వ ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సూచించారు.

అవెన్యూ ప్లాంటేషన్, బ్లాక్ ప్లాంటేషన్ లో భాగంగా రోడ్లకు ఇరువైపులా గుంతలు తీసి మొక్కలు నాటాలని అన్నారు. మండలాలలో ప్రతి మంగళ వారం, శుక్రవారం డ్రై డే పాటించే విధంగా చూడాలని అన్నారు. సీజనల్ వ్యాధులు ,మలేరియా, డెంగ్యూ తదితర వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, చెరువు గట్లపై మొక్కలు నాటాలని కలెక్టర్ తెలిపారు. మండల సమైక్యలో మహిళా సంఘాలకు మరియు ఉపాధి హామిలో పని చేసే వారిని సమన్వయం చేసుకొని గూగుల్ పే కు బదులుగా ఇండియన్ పోస్ట్ భారత్ పే (ఐ.పి.బి.పి.) యాప్ ను డౌన్ లోడ్ చేయించి వారిని అకౌంట్లు ఓపెన్ చేయించే విధంగా చూడాలని అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్, శ్యాం ప్రసాద్ లాల్, ఆర్డీఓ ఆనంద్ కుమార్, జిల్లా పంచాయతి అధికారి వీర బుచ్చయ్య, జిల్లా అటవీ శాఖ అధికారి బాలమణీ, మున్సిపల్ కమీషనర్ సేవ ఇస్లావత్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, సిపిఓ కొమురయ్య, తహశిల్దార్లు, ఎంపిడిఓలు, మున్సిపల్ కమీషనర్లు, తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents